Football Legend Pele : ఆసుపత్రిలో ఫుట్ బాల్ దిగ్గజం.. ఆందోళనలో అభిమానులు

బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే మళ్లీ ఆసుపత్రిలో చేరారు. అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడుతున్న పీలే.. ఇటీవలి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Football Legend Pele : ఆసుపత్రిలో ఫుట్ బాల్ దిగ్గజం.. ఆందోళనలో అభిమానులు

Football Legend Pele : బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే ఆసుపత్రిలో చేరారు. పీలే క్యాన్సర్ తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. పీలే ఆసుపత్రిలో చేరిన విషయాన్ని ఆయన కూతురు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే అభిమానులు భయపడాల్సిన పని లేదంది. ఇందులో ఎలాంటి సర్ ప్రైజ్ కానీ ఎమర్జెన్సీ కానీ లేవంది. ఆల్బెర్ ఐన్ స్టీన్ ఆసుపత్రిలో పీలే అడ్మిట్ అయ్యారు.

పీలే ”వాపు”తో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని, ఆయన ఆరోగ్య సమస్యల గురించి మరింత లోతుగా అంచనా వేయడానికి అనేక పరీక్షలు చేస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. “ఎమర్జెన్సీ లేదా సర్ ప్రైజ్ ఏమీ లేదు. న్యూ ఇయర్ కల్లా అక్కడ ఉంటాము. కొత్త చిత్రాలను పోస్ట్ చేస్తానని వాగ్దానం చేస్తున్నా” అని పీలే కూతురు పోస్ట్ చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పీలే వయసు 82ఏళ్ల. సెప్టెంబర్ 2021లో ఆయన పెద్దపేగు నుండి కణితిని తొలగించారు. అప్పటి నుండి రెగులర్ ట్రీట్ మెంట్ కోసం తరుచుగా ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు కుటుంబసభ్యులు. తన ఆరోగ్య సమస్యలపై లోతైన అంచనా కోసం పీలే అనేక పరీక్షలు చేయించుకున్నారు. పీలే ఆరోగ్య పరిస్థితి గురించి పీలే మేనేజర్ కానీ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్ వర్గాలు కానీ వెంటనే వివరాలు చెప్పలేదు. పీలేకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తెలిసింది. ఇక, కీమోథెరపీ చికిత్సతో ఆశించిన ఫలితాలు రావడం లేదని సమాచారం.

అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడుతున్న పీలే.. ఇటీవలి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తుంటి శస్త్రచికిత్స తర్వాత బాగా ఇబ్బంది పడుతున్నారు. పదే పదే నొప్పి తిరగబెడుతోంది. నడవడానికి కూడా అవస్థ పడుతున్నారు.