Pink Pigeon : ఆశ్చర్యపరుస్తున్న పింక్ కలర్ పావురం .. ఎక్కడంటే?

UK లో పింక్ పావురం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మాంచెస్టర్ వీధుల్లో తిరుగుతూ సందడి చేసింది. సోషల్ మీడియాలో ఈ పావురం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Pink Pigeon

Pink Pigeon : సాధారణంగా పావురాలు బూడిద, తెలుపు, గోధుమ షేడ్స్‌లలో ఉంటాయి. కొన్ని జాతుల పావురాళ్లు నీలం, ఊదా రంగులతో పాటు పలు రంగుల్లో కనిపిస్తుంటాయి. అయితే యూకేలో పింక్ కలర్ పావురం ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అది సహజంగానే గులాబి రంగులో ఉందా?  లేక ఎవరైనా రంగు వేసారా? అని అందరికీ అనుమానం వచ్చింది.

Bhagavanth Kesari : న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర.. భగవంత్ కేసరి ఫ్లాష్ మాబ్.. వీడియో వైరల్

బరీ టౌన్ సెంటర్‌లో గులాబీ రంగు పావురం కనిపించడంతో UKలోని ప్రజలు అవాక్కయ్యారు. ఈ పావురం స్ధానికులు వేసే ఫుడ్ తింటూ కనిపించింది. అయితే చాలామంది ఈ పావురం సహజంగానే గులాబీరంగులో ఉందా? ఎవరైనా రంగు వేసి ఉంటారా? అని కూడా అనుమానపడ్డారట. ఈ పావురం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. వీరు కూడా దానికి రంగువేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

CM Mamata banerjee : స్పెయిన్‌‌లో దీదీ జాగింగ్ వీడియో వైరల్ .. అదే చీరకట్టుతో చలాకీగా

గతంలో న్యూయార్క్‌లో గులాబీ రంగు వేసిన పింక్ పావురాన్ని రక్షించారట. మాన్‌హట్టన్‌లోని మాడిసన్ స్క్వేర్ పార్క్‌లో పోషకాహార లోపంతో కనిపించిన ఈ పక్షిని రక్షించి చికిత్స కోసం వైల్డ్ బర్డ్ ఫండ్‌కు తరలించారు.