కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఈ సమయంలో వివిధ విషయాలు తెరపైకి రాగా.. వేసవిలో దీని ప్రభావం తక్కువగా ఉంటుందని కొన్నిసార్లు.. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని మరికొన్ని సార్లు అధ్యయనం చెప్పబడింది. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో అద్యయనం రాగా.. అందులో వివిధ రక్త సమూహాలపై కరోనా ప్రమాదం భిన్నంగా ఉన్నట్లుగా గుర్తించారు.
జర్మనీ మరియు నార్వేకు చెందిన పరిశోధకులు కరోనాతో వివిధ బ్లడ్ గ్రూప్‌ల సంబంధాన్ని అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన ఆవిష్కరణ ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించబడింది. ఇటలీ మరియు స్పెయిన్ నుంచి 1,610 మంది రోగులను అధ్యయనం చేశాడు. ఇందులో కోవిడ్ -19 కారణంగా శ్వాస ఉపకరణం విఫలమైనట్లుగా గుర్తించారు.
ఇక ఈ అధ్యయనంలో ‘A’ బ్లడ్ గ్రూప్ ప్రజలు కరోనాకు ఎక్కువగా గురవుతారని అధ్యయనంలో తెలిసింది. ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో కరోనా ప్రమాదం అతి తక్కువ. ‘A’ బ్లడ్ గ్రూప్‌లో ఎవరైనా కరోనా బారిన పడినట్లయితే, ఆక్సిజన్ ఇవ్వడం లేదా వెంటిలేటర్‌పై ఉంచాల్సిన అవసరం ‘O’ సమూహంతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ అని అధ్యయనం వెల్లడించింది.
అయితే ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి సోకకుండా ఉంటుంది అనుకోవడం తప్పని, అయితే వారికి ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం స్పష్టం చేసింది. ‘O’ బ్లడ్ గ్రూప్ వారు సార్వత్రిక దాతలు. అంటే అవసరమైతే వారి రక్తాన్ని ఎవరికైనా అందించవచ్చు.