Tower Lantern Changer : టవరెక్కి లైట్ బల్బ్ మారిస్తే రూ.కోటి జీతం.. నిజమే..

టవరెక్కి లైట్ బల్బ్ మారిస్తే రూ.కోటి జీతం. అంతేనా.. చాలా ఈజీ పని అనుకుంటున్నారు కదా.. చాలా రిస్క్ చేయాలి. జీవితంలో రిస్క్ చేసైనా సరే సంపాదించాలనుకునే వారే ఈ పని చేయగలరు. ఈ జాబ్ చేయాలంటే ముందు ధైర్య, సాహసాలు ఉండాలి.

Viral Video

Viral Video : ఈ ప్రపంచంలో బతకాలంటే ఒక్కోసారి రిస్క్ చేయాలి. చాలీ చాలని జీతాలు, బాధ్యతలు ఇవన్నీ దాటుకుంటూ ముందుకెళ్లాలంటే రిస్క్ చేసే జనం చాలామంది ఉన్నారు. చాలా రోజులుగా టవర్లపై బల్బులు మారిస్తే కోట్లలో జీతం అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అసలు ఈ ఉద్యోగం ఏంటి.. ఎందుకు అంత జీతం? చదవండి.

Daughter Gift : మొదటి జీతంతో తండ్రికి విలువైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. వీడియో వైరల్

రీసెంట్ గా సోషల్ మీడియాలో టవర్ పైకి ఎక్కి లైట్ బల్బ్ మారుస్తున్న వ్యక్తుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో కానీ ఇది ఆషామాషీ ఉద్యోగం కాదు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినవారు మాత్రమే ఈ పని చేస్తారు. ఇక 600 మీటర్ల నుంచి 1500 మీటర్ల పొడవైన టవర్లు ఎక్కాల్సి ఉంటుంది. అవి రెగ్యులర్ టవర్స్ కాదు.. సిగ్నల్ టవర్స్. అంత ఎత్తుకి వెళ్లి లైట్ బల్బ్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది.

 

ఈ టవర్లు మెటల్ బ్రాకెట్‌తో తయారు చేసినవి. ఎక్కేవారికి నిజానికి ఎటువంటి రక్షణ ఉండదు. ఇక ఈ జాబ్‌లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. మరీ ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలు ఎక్కాలంటే భయం లేనివారై ఉండాలి. ఇక టవర్ ఎక్కడానికి దిగడానికి అక్కడ చేసే పనికి దాదాపుగా 6 గంటలు సమయం పడుతుంది. టవర్ పై భాగానికి వెళ్లినపుడు వీచే బలమైన గాలుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆరు నెలలకు టవర్ ఎక్కాల్సి ఉంటుంది. అందుకోసం అక్షరాల $20,000 (ఇండియన్ కరెన్సీలో 1,63,2300) చెల్లిస్తారు.

Netflix’s Private Jet: : అటెండెర్ ఉద్యోగానికి రూ. 3 కోట్ల జీతం..! సంచలనంగా మారిన భారీ ప్యాకేజ్‌..!!

ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియోలో సౌత్ డకోటాలోని ఓ వ్యక్తి టవర్ ఎక్కుతున్న వీడియో. లైట్ బల్బ్ ను మార్చడానికి అతనికి $20,000 చెల్లిస్తారు. సో జీవితంలో కొన్ని కావాలంటే రిస్క్ చేయాలి అనుకునే వ్యక్తులు ముఖ్యంగా ధైర్య,సాహసాలు ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ ఉద్యోగం చెయ్యగలరు అని అనిపిస్తోంది.