Woman Re lives: చనిపోయిందనుకున్న మహిళ శవపేటికలోంచి లేచొచ్చింది” ఆతరువాత ఏం జరిగిందంటే!
కారు ప్రమాదంలో చనిపోయిందని భావించి, ఒక మహిళను ఆమె బంధువులు శవపేటికలో పెట్టి పూడ్చిపెడుతుండగా..ఆమె ఆ శవపేటికను లోపలి నుంచి తట్టడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది
- Bharath Reddy
- Published On : May 4, 2022 / 10:50 PM IST
Woman
Woman Re lives: కారు ప్రమాదంలో చనిపోయిందని భావించి, ఒక మహిళను ఆమె బంధువులు శవపేటికలో పెట్టి పూడ్చిపెడుతుండగా..ఆమె ఆ శవపేటికను లోపలి నుంచి తట్టడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే పెరూ దేశానికి చెందిన ‘రోసా ఇసాబెల్ సెస్పెడెస్ కలాకా’ ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించింది( పొరపాటున ప్రకటించారు). ఆ కారు ప్రమాదంలో కలాకా ముగ్గురు మేనల్లుళ్లు తీవ్ర గాయాలపాలవగా, ఆమె బంధువు ఒకరు మృతి చెందాడు. 5, 11, 17 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు పరిస్థితి విషమించడంతో లంబాయేక్ ప్రాంతీయ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
Also Read:Kashmir valley: కాశ్మీర్ తీవ్రవాదుల చేతిలో అమెరికన్ ఆయుధాలు
ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటనలో రోసా ఇసాబెల్ సెస్పెడెస్ కలాకా కూడా మృతి చెందిందని భావించిన బంధువులు ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా అనుకున్న సమయానికి కాకుండా ఏప్రిల్ 26న రోసా కలాకా అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. అయితే రోసా మృతదేహాన్ని శవపేటికలో పెట్టి గొయ్యిలో దించబోతుండగా, శవపేటిక లోపలి నుండి వస్తున్న శబ్దం విని ఆమె బంధువులు షాక్ కు గురయ్యారు మరియు వెంటనే దానిని తెరిచి చూడగా చనిపోయిందని భావించన రోసా సజీవంగా ఉంది. దీంతో వెంటనే ఆమెను అలానే శవపేటికతో సహా ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆమె కొన్ని గంటల తరువాత ఆసుపత్రిలో మరణించింది. దీంతో రోసా బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని రోసా బందువులు తెలిపారు.
Also Read:Corona Next Season: మరోసారి కరోనా వ్యాప్తి తప్పదు: ఇజ్రాయెల్ పరిశోధకులు
