Kashmir valley: కాశ్మీర్‌ తీవ్రవాదుల చేతిలో అమెరికన్ ఆయుధాలు

జమ్ము-కాశ్మీర్‌లో తీవ్రవాదులు మెరుగైన ఆయుధాలు వాడుతున్నట్లు సైనికులు గుర్తించారు. తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

Kashmir valley: కాశ్మీర్‌ తీవ్రవాదుల చేతిలో అమెరికన్ ఆయుధాలు

Kashmir Valley

Kashmir valley: జమ్ము-కాశ్మీర్‌లో తీవ్రవాదులు మెరుగైన ఆయుధాలు వాడుతున్నట్లు సైనికులు గుర్తించారు. ఇటీవల కాశ్మీర్ లోయలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పలువురు తీవ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రవాదులు అమెరికా, కెనడాతోపాటు నాటోకు చెందిన ఆయుధాలు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టీల్ కోర్ బుల్లెట్లు, కెనడియన్ నైట్ సైట్స్ వంటి ఆయుధాలను తీవ్రవాదులు వాడుతున్నట్లు కనుగొన్నారు.

The Kashmir Files: ఓటీటీలో డేట్ లాక్ చేసుకున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’

ఇటీవల ఈ బుల్లెట్లతోనే తీవ్రవాదులు మన సైన్యంపై కాల్పులు జరిపారు. అయితే, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉండటం వల్ల మన సైనికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఆయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి రావడానికి కారణం ఉంది. ఇవి ఆఫ్ఘనిస్తాన్‌లో గత ఏడాది అమెరికా ఆధ్వర్యంలోని నాటో దళాలు వదిలేసినవి. ఇవి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ల నుంచి పాకిస్తాన్‌ తీవ్రవాదులకు, అక్కడి నుంచి కాశ్మీర్ తీవ్రవాదులకు చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం తీవ్రవాదుల చేతుల్లోకి చేరిన అధునాతన ఆయుధాల నుంచి రక్షణ పొందాలంటే మన సైన్యానికి లెవల్ 4 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు.