The Kashmir Files: ఓటీటీలో డేట్ లాక్ చేసుకున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’

బాలీవుడ్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమాలో...

The Kashmir Files: ఓటీటీలో డేట్ లాక్ చేసుకున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’

The Kashmir Files Locks Ott Streaming Date

The Kashmir Files: బాలీవుడ్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమాలో కశ్మీరీ పండితులపై జరిగిన అఘాయిత్యాలను మన కళ్లకు కట్టినట్లు చూపెట్టాడు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు తమ పర్ఫార్మెన్సులతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

The Kashmir Files: మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’

అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను సెలబ్రిటీల దగ్గర్నుండి సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. దీంతో ఈ సినిమాను ఎప్పట్నుండి స్ట్రీమింగ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

The Kashmir Files: ఆగని కలెక్షన్లు.. 200 కోట్ల క్లబ్‌లోకి కాశ్మీర్ ఫైల్స్!

దీనికి సంబంధించి జీ5 నేడు అధికారిక ప్రకటన చేసింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని మే 13 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు జీ5 ప్రకటించింది. దీంతో అభిమానులు ఈ సినిమాను చూసేందుక రెడీ అవుతున్నారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేయగా, ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. మరి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఓటీటీలో ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి.