Kodali Nani : కొడాలి నాని యాక్టివ్.. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అలా చేయాలని ఫిక్స్ అయిపోయారా? జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారా?
Kodali Nani : గుడివాడలో రాబోయే ఎన్నికల నాటికి ఎలాంటి మార్పు ఉండబోతోందన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది. గత ఎన్నికల సమయంలో తాను మరోసారి పోటీ చేయనని, ఇదే చివరి అవకాశమని ఆయన అప్పట్లో చెప్పారు. అయినా ఆయన్ను ప్రజలు ఓడించారు. గుడివాడ నుంచి టీడీపీ తరఫున వెనిగండ్ల రాము విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టీడీపీ అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Kodali Nani
Kodali Nani : పవర్లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఎప్పుడూ న్యూస్ హెడ్‌లైన్‌గా ఉండటం ఆయన స్టైల్. రెండేళ్లు అయితే ఎక్కడ చూసినా ఆయన పేరే హైలెట్. కూటమి పవర్లోకి రాగానే అరెస్టయ్యే నేతల లిస్ట్‌లో మొదటగా వినిపించింది ఆయన పేరే. వరుస కేసులు.. ఓ వైపు అనారోగ్య సమస్యలు.. ఇటు లీగల్ ఫైట్.. అటు హెల్త్ ట్రీట్‌మెంట్‌తోనే రెండేళ్లు టైమ్ ముగిసిపోయింది. ఇన్నాళ్లు ట్రబుల్స్ ఫేస్ చేసిన ఆయన ఇప్పుడు మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చే ప్లాన్ చేస్తున్నారట. అసలు ఎవరా నేత? ఆయన పొలిటికల్‌గా యాక్టివ్ కావడానికి రీజనేంటి.? వచ్చే ఎన్నికల్లో ఆ నేత కంటెస్ట్ చేస్తారా.? లేక గతంలో అన్నమాటకే కట్టుబడి ఉంటారా.?
Also Read : Gold Silver Price Today : కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి బంగారం, వెండి ధరలు ఇవే..
హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ట్రాక్ రికార్డు. పదునైన మాటలకు.. దూకుడుకు మారుపేరుగా తెలుగు స్టేట్స్లో పరిచయం అక్కర్లేని పేరు కొడాలి నాని. అయితే 2024 జూన్‌కు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా నాని పొలిటికల్ కెరీర్ రెండుగా డివైడ్ చేసి చూస్తున్న పరిస్థితి. గతంలో పవర్లో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా నాని హల్చలే వేరు. ఆయన ఎక్కడున్నా హడావుడి..విమర్శల దాడి..పొలిటికల్ పంచ్‌లు అంతా ఇంతా కాదు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి రాజకీయంగా.. మరోవైపు కేసులు ఫేస్ చేస్తూ .. ఇంకోవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ వచ్చారు. అప్పుడప్పుడు తెరపై కనిపిస్తూ.. ఆన్ అండ్ ఆఫ్.. సైటెంట్ అండ్ యాక్టివ్ మోడ్‌ను మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. ఆ మధ్య వల్లభనేని వంశీ అరెస్ట్ అప్పుడు మీడియాలో కనిపించారు. రెండు, మూడు నెలల క్రితం.. అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఆయన అరెస్ట్ అప్పుడు పరామర్శకు వెళ్లి కాస్త బిగ్ సౌండే చేసి నాని చర్చకు దారితీశారు.
ఈ మధ్య తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో వైసీపీ అధినేత జగన్‌ను కొడాలి నాని ప్రత్యేకంగా భేటీ అయి చర్చించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో నాని గుడివాడ నుంచి పోటీ చేస్తారా.? గుడివాడలో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి.? అనేదానిపై డిస్కషన్ చేశారట. అయితే ఇన్నాళ్లు పొలిటికల్‌గా యాక్టీవ్ లేకుండా.. ఇప్పుడు వ్యూహాత్మకంగా తెరమీదకు వచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కొడాలి నాని రీఎంట్రీపై వైసీపీ లీడర్లు, క్యాడర్ ఖుష్ అవుతున్నా..ఈ సారి ఆయన గుడివాడలో పోటీ చేస్తారా.? లేదా.? అన్నది ఇప్పటికైతే తేల్చుకోలేని అంశంగానే ఉండిపోతుందట. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి.. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. కంచుకోట లాంటి గుడివాడలో పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నం చేస్తారా లేక గత ఎన్నికల్లో పోటీ సమయంలో చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉంటారా.? అనేది ఆసక్తికరంగా మారింది.
గుడివాడలో రాబోయే ఎన్నికల నాటికి ఎలాంటి మార్పు ఉండబోతోందన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది. గత ఎన్నికల సమయంలో తాను మరోసారి పోటీ చేయనని, ఇదే చివరి అవకాశమని ఆయన అప్పట్లో చెప్పారు. అయినా ఆయన్ను ప్రజలు ఓడించారు. గుడివాడ నుంచి టీడీపీ తరఫున వెనిగండ్ల రాము విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టీడీపీ అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని పోటీకి దూరంగా ఉంటారా.? లేకపోతే మాట వెనక్కి తీసుకుని మళ్లీ పోటీ చేస్తారా.? లేదా.? అనేది డిసైడ్ చేసుకోవాల్సింది నానినే అని వైసీపీ పెద్దలు ఆయన నిర్ణయానికే వదిలేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో యాక్టివిటీని స్పీడప్ చేయట్లేదు. తన ఇలాకాగా చెప్పుకునే గుడివాడలో గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రజల్లోకి రావడం కొడాలి నాని తగ్గించారు. అయితే గుడివాడ పాలిటిక్స్ మాత్రం కొడాలి నాని కనుసన్నల్లోనే నడుస్తాయనేది ఓపెన్ సీక్రెట్. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్‌లో గుడివాడ నుంచి కంటెస్ట్ చేయడంపై కొడాలి నాని డెసిషన్ ఏంటన్నది ఇంకో చర్చగా ఉంది.
తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ 2024 ఎలక్షన్ టైమ్‌లో చెప్పిన కొడాలి నాని.. తన తమ్ముడి కుమారుడు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని కూడా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు. తనకు ఇద్దరు కూతుర్లు, వాళ్లకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదని చెప్పిన నాని.. తన తమ్ముడి కొడుక్కు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో నానినే పోటీ చేస్తారా.? తన తమ్ముడి కొడుకును బరిలోకి దింపుతారా.? వైసీపీ అధిష్టానం మరొకరికి టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తుందా అనేది వేచి చూడాలి మరి.
