Pawan Kalyan : కన్ఫ్యూజన్స్ వద్దు.. జనసైనికులకు ఆ విషయంలో పవన్ క్లారిటీ ఇచ్చినట్లేనా? ఆయన వ్యాఖ్యల వెనుక లోతైన వ్యూహం ఉందా? విజయ్‌తో పోల్చడంపై ఫైర్..
Pawan Kalyan : తమిళనాడులో విజయ్ పార్టీతో జనసేనను పోల్చొద్దంటూ తీవ్రంగానే స్పందించారు పవన్. విజయ్ పార్టీ తమిళనాడులో గెలవడంతో తన విషయంలో కూడా అలాగే చేయమంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎవరో ఎక్కడో ఏదో చేస్తే దానికి ఏపీకి పోలిక ఏంటంటూ ప్రశ్నించారు. ఊళ్లో పెళ్లికి ఎవరో సందడి అన్నట్లుగా వ్యవహారం ఉందని.. తన మీద జరిగిన ట్రోల్స్, విమర్శలకు గట్టిగానే ఇచ్చిపడేశారు.
Pawan Kalyan
Pawan Kalyan : రిజల్ట్ అక్కడ.. రీసౌండ్ ఇక్కడ.. గెలుపు ఆయనది.. పోలిక ఈయనతో.. నిన్న మొన్నటి దాకా అదే రచ్చ.. సోషల్ మీడియా సెంట్రిక్‌గా పవన్ టార్గెట్‌గా ట్రోల్స్ అంతా ఇంతా కాదు. దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయాలంటూ.. ఓ రేంజ్ హిట్టింగ్ నడిచింది. కాస్త లేటైనా ప్రత్యర్థుల స్రైక్ రేటును డ్యామేజ్ చేసేందుకు.. పవన్ మార్క్ యార్కర్లు వేశారు. మీరు సిక్సర్లకు ట్రై చేస్తే.. తాను క్లీన్ బౌల్డ్ చేస్తానంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. సేనాని ఔట్రైట్ క్లారిటీ అందుకేనా.? పొత్తుపై మళ్లీ స్పష్టత ఇచ్చినట్లేనా.? పవన్ వ్యాఖ్యల వెనుక లోతైన వ్యూహం ఉందా? అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది.
విజయం అంటే విజయ్‌ది. ఒంటరిగా పోటీ చేసి సొంత బలంతో పవర్లోకి వచ్చారంటూ..విజయ్‌తో పవన్‌ను పోలుస్తూ పెద్ద చర్చే జరిగింది. సోషల్ మీడియాలో పవన్ రాజకీయ ప్రత్యర్థులు కామెంట్లు, పోస్టులతో హీటెక్కించారు. పవన్ పొత్తులో గెలిచి గొప్పలు చెప్పుకుంటున్నారంటూ.. గట్టిగానే టార్గెట్ చేశారు. ఓ పది రోజుల పాటు మామూలు రచ్చ జరగలేదు. ఇదే సమయంలో పవన్‌కు అనారోగ్యం, సర్జరీ, తర్వాత రెస్ట్ అయిపోయాక ఈ మధ్యే మళ్లీ యాక్టివ్ అయ్యారు. లేటెస్ట్గా మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో అన్ని అంశాలపై ఔట్రైట్ క్లారిటీ ఇచ్చారు పవన్.
తమిళనాడులో విజయ్ పార్టీతో జనసేనను పోల్చొద్దంటూ తీవ్రంగానే స్పందించారు పవన్. విజయ్ పార్టీ తమిళనాడులో గెలవడంతో తన విషయంలో కూడా అలాగే చేయమంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎవరో ఎక్కడో ఏదో చేస్తే దానికి ఏపీకి పోలిక ఏంటంటూ ప్రశ్నించారు. ఊళ్లో పెళ్లికి ఎవరో సందడి అన్నట్లుగా వ్యవహారం ఉందని.. తన మీద జరిగిన ట్రోల్స్, విమర్శలకు గట్టిగానే ఇచ్చిపడేశారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు వేరు.. ఏపీ పొలిటికల్ సినారియో డిఫరెంట్ అన్న పవన్.. అక్కడ జరిగిందని ఇక్కడ తనను అలాగే చేయమంటూ సూచనలు చేయడమేంటని తనదైన స్టైల్లో ఇచ్చిపడేశారు. తాను 2019లో ఒంటరిగా పోటీ చేస్తే రెండు చోట్లా ఓడించారని గుర్తు చేసిన పవన్..పరిస్థితులు అర్థం చేసుకోవాలని సూచించారు. పదవులు ముఖ్యం కాదు.. ఒక పార్టీని నడపడానికి బలమైన భావజాలం ఉండాలంటూ పవన్ చెప్పుకొచ్చారు.
వారం, పదిరోజుల పాటు జరిగిన చర్చకు.. ఒకే ఒక్క వేదిక నుంచి చెక్ పెట్టినంత పనిచేశారు పవన్. విజయ్ గెలుపు చూసి జనసేన నాయకులు చాలా మంది తమ పార్టీ అలాగే చేసి ఉండాలని కోరుకున్నారు. డిబేట్లు కూడా పెట్టారు. వాటిన్నింటికీ ఒక్కటే జవాబు అన్నట్లుగా పార్టీ వేదిక మీదే పవన్ చెప్పాల్సింది చెప్పారు. తనకు పదవుల కంటే రాష్ట్రం ముఖ్యమన్న ఆయన..ఏపీలో రాజకీయం వేరుగా ఉందన్నారు. సేమ్‌టైమ్ కూటమిలో ఉన్నంత మాత్రానా తాను అన్నింటికి తల ఊపుతున్నట్లు కాదని కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు పవన్. కూటమి నిర్ణయాలన్నింటినీ అంగీకరిస్తున్నాననేది వాస్తవం కాదన్నట్లుగా క్లారిటీ ఇచ్చేలా కామెంట్స్ చేసి చర్చకు దారితీశారు. చంద్రబాబుకు తనకు కొన్ని అంశాలలో విభేదాలు ఉన్నాయని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకుముందు బాబుతో నో క్లాషెస్, నో డిఫరెన్స్ అన్న పవన్.. ఇప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా.. కూర్చుని చర్చించుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కూటమి పార్టీలలోని నేతలు కూడా అలానే వ్యవహరించాలని కోరారు.
అయితే జనసేనకు ఒంటరిగా పోటీ చేసే బలం లేదనేది పవన్‌ను వ్యతిరేకించే వాళ్లు చెప్పే మాట. కానీ 2019 రిజల్ట్స్‌ను గుర్తు చేసి ఇవ్వాల్సిన ఇండికేషన్ ఇచ్చేశారు పవన్. జనసేనకు సింగిల్‌గా పోటీ చేసే బలం కూడా ఉందని కూడా అంటున్నారు. కానీ రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నామని.. ఆనాడు తాము పొత్తులకు వెళ్లకపోతే మరోసారి వైసీపీ గెలిచేదని.. అప్పుడు రాష్ట్రం ఇంకా ఆగమయ్యేదని పవన్ అంటున్నారు. తాను ఎక్కడైనా రాజీపడ్డానంటే అది రాష్ట్రం కోసమే తప్ప మరోటి కాదనేది పవన్ వాదన. తాను ఎవరికైనా మద్దతు ఇస్తే త్రికరణ శుద్ధితో వ్యవహరిస్తాను.. వారి నుంచి కూడా చిత్తశుద్ధినే ఆశిస్తానన్నారు పవన్. కార్యకర్తలు పడే ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తామని.. సెట్‌రైట్ చేయగలిగినంత వరకు సరిచేస్తానని చెబుతున్నారు. అయితే ఓవరాల్‌గా పవన్ మాటల్లో కూటమిగా పోటీ చేస్తామనే ఇండికేషన్ ఇచ్చారని అంటున్నారు. విజయ్ గెలుపుతో తనను పోల్చడంతో హర్ట్ అయినట్లు చెప్పకపోయినా ఘాటుగా రియాక్ట్ అయి.. ఇంటా, బయటా అందరికీ ఆన్సర్ ఇచ్చేశారన్న చర్చ జరుగుతోంది.
