Sreeleela : క్రికెటర్ తో శ్రీలీల ప్రేమాయణం.. మొన్న తిరుమల.. నిన్న ముంబై.. నిజమేనా?
శ్రీలీల ఓ టీమ్ ఇండియా క్రికెటర్ తో ప్రేమలో ఉందని సమాచారం. (Sreeleela)
Sreeleela
Sreeleela : గత కొన్ని రోజుల క్రితం వరకు హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉందని, వాళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కార్తీక్ ఆర్యన్ తల్లి మా కోడలు డాక్టర్ అని చెప్పడంతో శ్రీలీల – కార్తీక్ రిలేషన్ ని ఫిక్స్ అయిపోయారు అంతా. అయితే తాజాగా శ్రీలీల రిలేషన్ గురించి కొత్త రూమర్ వినిపిస్తుంది.
శ్రీలీల ఓ టీమ్ ఇండియా క్రికెటర్ తో ప్రేమలో ఉందని సమాచారం. ఆ క్రికెటర్ ఎవరో కాదు మన తెలుగబ్బాయి తిలక్ వర్మ అంట. తిలక్ వర్మతో శ్రీలీల దాదాపు ఏడాది నుంచి ప్రేమలో ఉందట.
Also Read : Ram Charan : రామ్ చరణ్ కి ఆపరేషన్.. ఆందోళనలో అభిమానులు.. అంతా ‘పెద్ది’ వల్లే..
గత వైకుంఠ ఏకాదశి నాడు శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమల వెళ్లగా అదే రోజు అదే సమయానికి తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో తిరుమల వచ్చాడు. ఇటీవల IPL లో శ్రీలీల తల్లి ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఫ్యామిలీతో కలిసి కనిపించిందట. అలాగే ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్కి శ్రీలీల హాజరవగా తనతో పాటు ఉన్న ఓ వ్యక్తి తిలక్ వర్మ జెర్సీ ధరించాడట.
ఇటీవల తిలక్ వర్మ ఫ్రెండ్స్ మాట్లాడుతూ అతను ప్రేమలో ఉన్నాడని మీడియాతో చెప్పారు. ఇలా పలు సంఘటనలతో శ్రీలీల – తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి శ్రీలీల లేదా తిలక్ వర్మ దీనిపై స్పందిస్తారా లేదా చూడాలి. ఇక మొదట్లో హీరోయిన్ గా హిట్స్ కొట్టిన శ్రీలీల ఆ తర్వాత అన్ని ఫ్లాప్స్ చూసింది. మధ్యలో గుంటూరు కారం సినిమా పర్వాలేదనిపించినా మళ్ళీ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఓ హిందీ సినిమా, ఓ తమిళ్ సినిమా ఉన్నాయి. తెలుగులో వరుస సినిమాలు చేసిన శ్రీలీలకు ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.
Also See : Ram Charn : ఏమున్నాడ్రా బాబు.. రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ అదుర్స్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
