The Kashmir Files: మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’

కొన్ని చిత్రాలు ఎలాంటి భారీ క్యాస్టింగ్ లేకపోయినా, ఎలాంటి భారీ బడ్జెట్‌తో తెరకెక్కకపోయినా, అందులోని కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలాంటి సినిమాలకు.....

The Kashmir Files: మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’

The Kashmir Files Joined 250 Crore Club

The Kashmir Files: కొన్ని చిత్రాలు ఎలాంటి భారీ క్యాస్టింగ్ లేకపోయినా, ఎలాంటి భారీ బడ్జెట్‌తో తెరకెక్కకపోయినా, అందులోని కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ జాబితాలో చేరిన సినిమాగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిలిచింది. భారీ తారాగణం లేదు.. భారీ బడ్జెట్ మూవీ కాదు.. అయినా జనం ఈ సినిమాకు నీరాజనం పలికారు.

The Kashmir Files: మౌత్ టాక్‌తోనే భారీ రికార్డ్స్ కొల్లగొడుతోన్న సినిమా!

కేవలం కథలో ఉన్న దమ్ము ప్రేక్షకులను ఈ సినిమాను పదేపదే చూసేలా చేసింది. కశ్మీర్‌లో జరిగిన యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కశ్మీరీ పండిత్‌లపై తిరుగుబాటు ఏ విధంగా జరిగిందో మన కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఇక ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్‌కు ప్రతి భారతీయుడు కనెక్ట్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.

The Kashmir Files: ఆగని కలెక్షన్లు.. 200 కోట్ల క్లబ్‌లోకి కాశ్మీర్ ఫైల్స్!

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమాకు రోజురోజుకూ ప్రేక్షకాదరణ పెరుగుతుండటంతో, భారీ వసూళ్లు రాబట్టడంలో సక్సెస్ అయ్యింది. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.250 కోట్ల మేర వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయగా, ది కశ్మీర్ ఫైల్స్ నిర్మాతలకు లాభాల పంటను అందించింది. ఇక ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయ్ మండ్లేఖర్, ప్రకాష్ బెలవాడి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.