The Kashmir Files: మౌత్ టాక్‌తోనే భారీ రికార్డ్స్ కొల్లగొడుతోన్న సినిమా!

స్టార్ హీరో లేడు.. హీరోయిన్ తో డ్యూయెట్ లేదు.. మాస్ మసాలా యాక్షన్ సీన్స్ అసలే లేవు. కానీ చిన్న సినిమాగా రిలీజై భారీ కలెక్షన్స్ రాబడుతుంది ది కశ్మీర్ పైల్స్.

The Kashmir Files: మౌత్ టాక్‌తోనే భారీ రికార్డ్స్ కొల్లగొడుతోన్న సినిమా!

The Kashmir Files

The Kashmir Files: స్టార్ హీరో లేడు.. హీరోయిన్ తో డ్యూయెట్ లేదు.. మాస్ మసాలా యాక్షన్ సీన్స్ అసలే లేవు. కానీ చిన్న సినిమాగా రిలీజై భారీ కలెక్షన్స్ రాబడుతుంది ది కశ్మీర్ పైల్స్. రోజురోజుకి పెరుగుతున్న కలెక్షన్స్.. కమర్షియల్ మేకర్స్ మతి పొగొడుతున్నాయి. ఓ భయంకరమైన చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించి.. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ది కశ్మీర్ ఫైల్స్ పై ఓ లుక్..

The Kashmir Files: ఓటీటీలో దేశం మెచ్చిన సినిమా.. ఎప్పుడంటే?

ఆడియెన్స్ ఎమోషనల్ అయిపోతున్నారు. థియేటర్ బయటికొచ్చాక కూడా వాళ్లని కొన్ని సీన్స్ వెంటాడుతున్నాయి. అవును ది కశ్మీర్ ఫైల్స్ మూవీ విషయంలో జరుగుతున్నది ఇదే. రోజురోజుకి బాక్సాఫీస్ లెక్కలు డౌన్ ఫాల్ అవుతున్న రోజుల్లో.. ఈ సినిమా కలెక్షన్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. అసలే అంచనాలు లేకుండా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ 5 రోజుల్లో 60కోట్ల 20లక్షలను రాబట్టింది. ఆరో రోజు కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే 8 కోట్లకు రీచై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఏముంది? ఇటు బెదిరింపులు.. అటు కలెక్షన్లు

దేశవ్యాప్తంగా 600 థియేటర్స్ లో రిలీజైన ది కశ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు 3500 మార్క్ ను చేరుకుంది. హ్యూజ్ లెవెల్ పబ్లిసిటీ లేకుండా కేవలం మౌత్ టాక్ తోనే సినిమాపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ పెంచేసుకుంటున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి రిలీజ్ చేసిన స్టార్స్ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బిక్కమొహం పెడుతుంటే.. 10 కోట్లతో వచ్చిన ఒరిజనల్ స్టోరీ ది కశ్మీర్ ఫైల్స్.. లాంగ్ రన్ లో 200 కోట్లను సంపాదించడం ఖాయంలా కనిపిస్తోంది. వివేక్ డైరెక్షన్.. అనుపమ్ కేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషీ వంటి వారి నటన సినిమాకి బూస్టప్ నిచ్చింది.

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి అరుదైన గౌరవం..

1990లో కశ్మీరి పండిట్స్ పై జరిగిన మారణ హోమాన్ని కళ్లకు కట్టినట్టు చూపించి కంటతడి పెట్టిస్తున్నాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. అప్పటి టెర్రరిస్ట్ ల అటాక్ తో కశ్మీర్ వదలివెళ్లిన 700 పండిట్స్ ద్వారా నిజాలు తెలుసుకున్న వివేక్.. దాదాపు 2సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు. కానీ నెలరోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాడు. అందరూ చూడాల్సిన సినిమా అంటూ ఇప్పటికే హర్యాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలు వినోద పన్నుపై రాయితీ ఇచ్చాయి. ఇక త్వరలోనే ఈ మూవీ ప్రాంతీయ భాషల్లోకి కూడా డబ్బింగ్ కాబోతుంది.