The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఏముంది? ఇటు బెదిరింపులు.. అటు కలెక్షన్లు

ఇటీవల 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మార్చ్ 11న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.......

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఏముంది? ఇటు బెదిరింపులు.. అటు కలెక్షన్లు

Kashmir Files (1)

The Kashmir Files :  ఇటీవల ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా మార్చ్ 11న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి.. లాంటి ఎంతో మంది బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటించారు. నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాని చూసి చిత్ర యూనిట్ ని అభినందించారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా చిత్ర యూనిట్ కి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కేవలం మౌత్ టాక్ తోనే రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఒకవైపు బెదిరింపులు, ఒకవైపు కలెక్షన్లు రావడానికి అసలు ఈ సినిమాలో ఏముంది అని ఆరా తీస్తున్నారు.

దేశ విభజన తర్వాత కశ్మీర్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాకిస్థాన్ కశ్మీర్ ని ఆక్రమించుకోడానికి చాలా ప్రయత్నించింది. కశ్మీర్ అంటే స్వతంత్రం ముందు ఒక అందమైన ప్రదేశం, హిందువులకు, వేద బ్రాహ్మణులు, కశ్మీర్ పండిట్లు అంటూ స్వర్గంలా విరాజిల్లుతూ ఉండేది. కానీ స్వతంత్రం అనంతరం కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం వల్ల, ఉగ్రవాదుల వల్ల, పాకిస్థాన్ వల్ల కశ్మీర్ స్వరూపమే మారిపోయింది.

‘ది కశ్మీర్ ఫైల్స్‌’ సినిమా కథ 1980-90లలో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండని తెలుపుతుంది. కశ్మీర్ లోని హిందువులపై పాకిస్తాన్‌, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీర్ పండిట్లను విచక్షణ రహితంగా చంపేశారు, ఆడవారిని మానభంగాలు చేసారు, చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేశారు. కశ్మీర్ ని స్మశానంగా మార్చారు. కశ్మీర్ లో ఉండాలంటే మతం మారాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని చంపేసి వారి ఆస్తులను దోచుకున్నారు.

ఈ మరణకాండలో కొన్ని లక్షల మంది హిందువులు చనిపోయారు. సుమారు మరో 5 లక్షల మంది కశ్మీరీ పండిట్‌లు భయపడి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. అయితే ఇదంతా చరిత్ర. ఇన్ని రోజులు పాలించిన రాజకీయ నాయకులు కూడా ఈ చరిత్రని బయటకి రాకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కశ్మీర్ పరిస్థితులు మెరుగు పడుతున్నాయి.

Radhakrishna : ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మౌత్ ఆర్టిస్ట్ పై రాధేశ్యామ్ డైరెక్టర్ ప్రశంశలు.. నీపై సినిమా తీస్తారంటూ..

ఇలాంటి నిజాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పాలంటే, సినిమా రూపంలో తెరకెక్కించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వివేక్‌ అగ్నిహోత్రి ఈ చరిత్రని ‘ది కశ్మీర్ ఫైల్స్’ రూపంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఉన్న నిజాలని నిక్కచ్చిగా చూపించారు. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి చిత్ర యూనిట్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని బెదిరించారు. డబ్బులు ఆశ చూపి సినిమాని ఆపేయమని కూడా ప్రయత్నించారు. ఓ వర్గం మత పెద్దలు ఈ చరిత్ర బయటకి రావొద్దని హెచ్చరించారు. కేసులు కూడా వేశారు. అయినా డైరెక్టర్, నిర్మాతలు, చిత్ర యూనిట్ ఎక్కడా భయపడకుండా సినిమాని తెరకెక్కించారు. రిపబ్లిక్ డే రోజు ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అప్పుడు థియేటర్లు క్లోజ్ ఉండటంతో ఇటీవల రిలీజ్ చేశారు.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కి మైసూర్ విశ్వ విద్యాలయం డాక్టరేట్

ఇటీవల సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ”కశ్మీర్‌లో 1990వ దశకంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో చూపించాం. కశ్మీర్‌లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. దేశ ప్రజలకు తెలియకుండా చేశారు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను. ఈ సినిమా నిర్మాణంలో నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి’’ అని తెలిపారు.

The Kashmir Files : నిజాన్ని నిర్భయంగా చూపించిన సినిమా.. రోజురోజుకి పెరుగుతున్న వసూళ్లు

ఇక ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. కన్నీళ్లు పెడుతున్నారు. కశ్మీర్ నుంచి వెళ్లిపోయిన కుటుంబాలు ఈ సినిమా చూసి ఏడుస్తూ తమ జీవితాలని తెరపై చూపించారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా చూసి ఒక మహిళ డైరెక్టర్ వివేక్‌ పాదాలు తాకి, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడ్చింది. ఆమె లాంటి ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్‌, నటులు సైతం కంటతడి పెట్టుకున్నారు.

ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటుంది. మొదట తక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా రోజు రోజుకి థియేటర్ల సంఖ్యని పెంచుతూ కలెక్షన్లని కూడా పెంచుకుంటుంది. కనుమరుగైన చరిత్రని కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అనేకమంది ప్రముఖులు కూడా సినిమాని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా ఇది.