The Kashmir Files: ఓటీటీలో దేశం మెచ్చిన సినిమా.. ఎప్పుడంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైనా సినిమా గురించి చర్చ జరుగుతుందంటే అది ఖచ్చితంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అని చెప్పాలి. కేవలం బాలీవుడ్ జనాలే కాకుండా యావత్ దేశప్రజలు...

The Kashmir Files: ఓటీటీలో దేశం మెచ్చిన సినిమా.. ఎప్పుడంటే?

The Kashmir Files

The Kashmir Files: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైనా సినిమా గురించి చర్చ జరుగుతుందంటే అది ఖచ్చితంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అని చెప్పాలి. కేవలం బాలీవుడ్ జనాలే కాకుండా యావత్ దేశప్రజలు ఈ సినిమా గురించి విభిన్నమైన కామెంట్స్ చేస్తుండటంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది నేఫన్‌గా మారింది. ఇక ఈ సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన విధానం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాశ్మీర్‌లోని హిందూ పండిత్‌ల వలసల ఆధారంగా.. 1980-90లలో కాశ్మీర్‌లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మలిచిన తీరు బాలీవుడ్ వర్గాలతో పాటు మిగతా ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక పలు రాష్ట్రాలు ఈ సినిమాకు ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్‌ను మినహాయించగా, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఈ సినిమాను చూసేందుకు ఏకంగా హాఫ్ డే సెలవు ప్రకటించింది.

The Kashmir Files : ఈ సినిమాతో బాలీవుడ్ పాపాలని కడిగేశారు.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాపై కంగనా వ్యాఖ్యలు..

కాశ్మీర్‌లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కదిలించింది. దీంతో ఈ సినిమాకు సాధారణ ఆడియెన్స్ మొదలుకొని, సెలెబ్రిటీల వరకు అందరూ పట్టం కడుతున్నారు. ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటుల పనితీరును కూడా అందరూ ప్రశంసిస్తున్నారు. కాగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఓ చిన్న సినిమాగా తెరకెక్కినా, రిలీజ్ తరువాత అది భారీ విజయాన్ని అందుకుంది. తొలుత ఈ సినిమా వివాదాస్పద చిత్రంగా మిగులుతుందని ఆడియెన్స్‌తో పాటు సినీ క్రిటిక్స్ కూడా అంచనా వేశారు. కానీ సినిమాలోని కంటెంట్ ఆడియెన్స్‌ను థియేటర్లకు పరుగులు పెట్టేలా చేస్తోంది.

ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తే భారీ చిత్రాల మేకర్స్ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. రూ.18 కోట్లతో తెరకెక్కిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం మార్చి 11న దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం చూస్తే, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వారాంతం ముగిసేసరికి ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. వివేక్ అగ్నిహోత్రి టేకింగ్‌కు జనం ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని త్వరోలనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి అరుదైన గౌరవం..

ది కాశ్మీర్ ఫైల్స్ చిత్ర ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. అయితే తొలుత ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ చూసి జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ముందుగా అనుకున్నట్లుగా ఏప్రిల్ రెండో వారంలో కాకుండా మే 6న జీ5లో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారట. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తిల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.