పాకిస్తాన్ లో తిరిగి అడుగుపెట్టబోతున్న ముషార్రఫ్

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తిరిగి పాక్ లో అడుగుపెట్టబోతున్నారు. మే-1,2019న ముషార్రఫ్ పాకిస్తాన్ కి వస్తున్నట్లు ఆయన లాయర్ సులేమాన్ సఫ్దార్ శనివారం(ఏప్రిల్-27,2019)తెలిపారు.మే-2,2019న ప్రతేక న్యాయస్థానంలో విచారణకు ముషార్రఫ్ హాజరవుతాడని తెలిపారు.

మే-2,2019లోపల ముషార్రఫ్ స్పెషల్ కోర్టు ముందు హాజరవ్వాలని సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించిందని,హాజరుకాకపోతే తన కేసులో వాదించుకునే హక్కును ముషార్రఫ్ కోల్పోవడమే కాకుండా ప్రాసిక్యూషన్ వాదనల ఆధారంగా తీర్పు ఇస్తామని కోర్టు   చెప్పిందని సులేమాన్ తెలిపారు.దీంతో ముషార్రఫ్ పాక్ కు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ముషార్రఫ్ ను తిరిగి పాక్ కు రప్పించాడని తీసుకున్న చర్యలపై సమాధానం కోరుతూ ప్రభుత్వానికి సుప్రీం నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.2007లో పాక్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఎమర్జెన్సీ విధించినందుకు గాను మార్చి-31,2014న ముషార్రఫ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. దీంతో మెడికల్ ట్రీట్మెంట్ కోసమంటూ 2016 మార్చిలో పాక్ విడిచి దుబాయ్ వెళ్లిన ఆయన తిరిగి పాకిస్తాన్ లో అడుగుపెట్టలేదు.