అడ్వంచర్ ఉమెన్ :ప్రపంచంలోనే అతిపెద్దషార్క్‌తో ఈత కొట్టింది

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 06:52 AM IST
అడ్వంచర్ ఉమెన్ :ప్రపంచంలోనే అతిపెద్దషార్క్‌తో ఈత కొట్టింది

షార్క్ దాన్ని చూస్తేనే గుండె ఆగిపోతుంది. రంపంలా ఉండే దాని పళ్లను చూస్తే ఇక పై ప్రాణం పైనే పోతుంది. దాని కంట పడిన ఏ ప్రాణి అయిన ప్రాణాలపై ఆశ పోగొట్టుకోవాల్సిందే. కానీ ఓ మహిళ మాత్రం  ప్రపంచంలోనే అతిపెద్ద గ్రేట్ వైట్ షార్కుతో ఈదు చరిత్ర సృష్టించింది.  ఆ గ్రేట్ ఉమెన్ పేరు కింబర్లీ జెఫ్రీస్. ఆమె ఓ ఫోటో గ్రాఫర్.  గ్రేట్ వైట్ షార్కుల్లో ప్రపంచంలోనే అతిపెద్దవని చెబుతున్న డీప్ బ్లూ షార్క్‌. దాన్ని చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటిది దాంతో కలిసి జలకాలాటలు ఆడటమంటే మాటలు కాదు. ఆ డీప్ బ్లూ షార్క్ తో కలిసి ఈత కొట్టి..అరుదైన..అద్భుతమైన..సాహసమైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు ఫొటోగ్రాఫర్ కింబర్లీ జెఫ్రీస్. ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. బ్లూ షార్క్ తో కలిసి ఈదుతున్నప్పుడు నా గుండె పేలిపోతుందేమో అనిపించింది”దన్నారు. 
Read Also : ‘సివిజిల్’ యాప్ :ఎల‌క్ష‌న్ కంప్ల‌యింట్స్ ఎవ‌రైనా చేయొచ్చు

చనిపోయిన తిమింగలం కళేబరాన్ని తినడానికి వచ్చే షార్కులను ఫొటోలు తీయాలనుకుని ఫసిఫిక్ మహా సముద్రంలోని ద్వీపాల సమూహంలో ఒకటైన హవాయి ఐలాండ్ లోని ఓహూ కింబర్లీ  వెళ్లారు. అప్పుడు బోట్ ఇంజన్ (సముద్రంలో ఉన్న బోట్) వెనుక నుంచి టైగర్ షార్కులు రావడాన్ని చూశారు. వాటికోసమే వెయిట్ చేసే కింబర్లీ..గబగబా నీటిలోకి దిగారు. కానీ కనిపించలేదు..30 సెకన్ల తర్వాత ఆ భారీ షార్కును చూశారు. మెల్లగా నీటిలోంచి  బయటికొచ్చింది. నేరుగా తిమిగలం కళేబరం దగ్గరకు చేరుకుంది. 
 

ఆ షార్క్  6 మీటర్ల పొడవు..50 ఏళ్లు వయస్సు ఉంటుందని.. బరువు రెండున్నర టన్నులు ఉంటుందని అంచనా వేశారు. గ్రేట్ వైట్‌ను చూసి తమ టీమ్ అంతా షాక్ అయ్యిందని కింబర్లీ చెప్పారు. అంత పెద్ద షార్కును చూడడం నిజంగా అద్భుతంగా అనిపించిందన్నారు. “అది గ్రేట్ వైట్ అని మాకు తెలీగానే.. మొదట కొన్ని క్షణాలపాటు నా గుండె పేలిపోతుందేమో అనిపించిందని ఉద్వేగంగా తెలిపారు. మనం అంత పెద్ద గ్రేట్ వైట్ షార్కుకు అంత దగ్గర్లో ఉన్నప్పుడు ఏదైనా చేయడం చాలా ఎక్సయింట్ మెంట్ గా ఉంటుందని ఆ భావాన్ని తట్టుకోలేమని…కొన్ని క్షణాలపాటు నా గుండె పేలిపోతుందేమో అనిపించిందన్నారు కింబర్లీ.  
Read Also : ఆ సర్వేలో చెప్పిన జనం : మళ్లీ మోడీనే ప్రధాని కావాలి

“అది నిజంగా ఒక మాయలా అనిపించింది. ఇది నా జీవితంలో చాలా చాలా ప్రత్యేకమైన క్షణం”అన్నారామె. దాని భారీ ఆకారం చాలా అద్భుతంగా అనిపించింది”.క్కడ అది తినడానికి ఆహారం దగ్గరే ఉండటంతో ఎటువంటి ప్రమాదం ఉండదని నమ్మకంతో దాంతో కలిసి కాసేపు ఆ నీలి నీటిలో ఈత కొట్టారు..దాన్ని నలువైపులా షూట్ చేశారు.కానీ వన్యప్రాణులు  సహజంగా తిరిగే చోట షూట్ చేయటం ఓ అద్భుతమనీ..అటువంటి అద్భుతాలు చేయాలని  ప్రతి ఫొటోగ్రాఫర్‌కు ఒక కల” అంటారు కింబర్లీ.