Photography Awards: లక్ష మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పొచ్చు.. మనిషి చేస్తున్న తప్పులేంటో..

లక్ష మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫోటోతో చెప్పొచ్చు అని తెలియజేస్తున్నాయి ఈ ఫోటోలు. మనిషి చేసే తప్పిదాలేంటో ఆ ప్రభావం ఎంతగా ఉందో హెచ్చరిస్తున్నాయి..

Polar Bear pic Lazing On iceberg Climate Change Wins Prize : వంద మాటల్లో చెప్పలేనిది ఒక్క పాటలో చెప్పొచ్చు. వెయ్యి వెయ్యి పదాలలో చెప్పలేని భావాన్ని ఇదిగో ఈ ఒక్క ఫొటోతో చెప్పొచ్చు. మనిషి చేసే తప్పిదాలేంటో. చిన్న మంచు ఫలకంపై ఓ దృవపు ఎలుగుబంటి ముడుచుకుని పడుకున్న ఈ ఫోటో చూడ్డానికి సాధారణంగానే అనిపిస్తుంది. కానీ ఆలోచించి చూస్తే ఎటువంటి ప్రమాదం ఉందో అర్థం అవుతుంది. ఈ ఫోటోని నిశితంగా పరిశీలిస్తే.. ప్రకృతికి మనిషి చేస్తున్న హాని ఏంటో తెలియజెబుతోంది ఈ ఫోటో.

గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం ఎంతగా ఉందో భూమిపైనా మంచు ఖండంపైనా ఎంతటి ప్రభావం చూపిస్తోంది తెలియజెప్పే ఈ ఫోటో అందరిని ఆలోచింపజేస్తోంది. ఇకనైనా మారండి అని..ఇకనైనా ఆలోచించండీ అని హెచ్చరిస్తోంది.గ్లోబల్ వార్మింగ్ తో కరుగుతున్న మంచు ఖండాలు..ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. మనిషి ప్రకృతి చేసే హాని ఈ ఫోటో హెచ్చరిస్తోంది. ప్రముఖ ఫోటో గ్రాఫర్ మరెక్‌ జకోవ్‌స్కి తీసిన ఈ ఫోటోకు ఇంటర్నేషనల్‌ గోల్డెన్‌ టర్టిల్‌ ఫస్టు ప్రైజ్ లభించింది.

Read more : Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

 

ప్లాస్టిక్ భూతానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫోటో..

మనిషి అలవాటు చేసుకున్న ప్లాస్టిక్. ప్రకృతికి ఎంతటి హాని కలిగిస్తోందో తెలిసి కూడా మనిషి దాన్ని వాడకం మానటంలేదు అంటే మనిషి కరెన్సీకే కాదు ప్లాస్టిక్ వాడకానికి కూడా బానిస అయిపోయాడా? అనిపిస్తోంది. ప్లాస్టిక్‌ వల్ల ఎన్ని మూగ జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయో ఇకనైనా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.సముద్రాలను కూడా ఈ ప్ల మనం వదిలిపెట్టడం లేదు.. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఇది మాల్స్‌లో ఇచ్చే ప్లాస్టిక్‌ నెట్‌. ఇప్పుడు ఈ చేపకు మృత్యుపాశంగా మారింది.. ప్లాస్టిక్ నెట్‌లో చిక్కుకుని బయటపడటానికి ఈ చేప ఎంతగా ఇబ్బందులు పడుతుందో అర్థమయ్యేలా ప్రముఖ ఫోటో గ్రాఫర్ పాస్క్వేల్‌ వాజెల్లో తీసిన ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. హ్యూమన్స్‌ అండ్‌ నేచర్‌ కేటగిరీలో రెండో బహుమతిని గెలుచుకుందీ ఫోటో..

ట్రెండింగ్ వార్తలు