Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

వాతావరణం, ఇంట్లోని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇంటి పరిసరాల్లో చుట్టూ మొక్కలు పెంచుకోవటం మంచిది. ఇంటి లోపలకు బయట నుండి వచ్చే వాయు కాలుష్యాన్ని మొక్కలు కొంతమేర నిలువరిస్తాయి. మొక్కలు స్వస్ఛమైన గాలిని, ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఇంట్లో ఉండే వారికి ఆహ్లాదాన్ని పంచుతాయి.

Home Pollution  : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

Pollution 2

Home Pollution : కాలుష్యం కోరలు చాస్తోంది. పలు అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పుతున్నారు. వాహనాలు, పరిశ్రమల నుండి వస్తున్న దుమ్ము ధూళీ కారణంగా రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. దీని నుండి రక్షణ పొందేందుకు ప్రజలు వివిధ రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. ముక్కు నుండి పీల్చే గాలి ద్వారా కాలుష్యాలు ఊపిరితిత్తుల లోకి ప్రవేశించకుండా మాస్క్ లు, చున్నీలు, చేతి రుమాళ్ళు కట్టుకోవటం వంటి పద్దతులను పాటిస్తున్నారు. బయటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇలాంటి జాగ్రత్త చర్యలు కొంత మేర సరిపోతాయి. అయితే ఇంట్లో ఉండే కాలుష్యమే ప్రస్తుతం పెద్ద సమస్యగా తయారైంది.

మనం వినియోగించే వస్తువులు, ఇంటిలోపల అంతర్గత కాలుష్య సమస్యకు కారణమౌతున్నాయి. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆసన్నమైంది. ప్రధానంగా పట్టణాలలో ఉండే గృహాలు బయట నుండి వచ్చే కాలుష్యంతో నిందిపోతున్నాయి. దీనితోడు ఇంట్లో పొగ, కార్పెట్లకు అంటుకుని ఉండే దుమ్ము, దూళ్ళి, ఇతర వస్తువులు కాలుష్యాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఇదే విషయంపై ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్ధ సైతం ఓ నివేదిక రూపొందించింది. ప్రపంచంలోని అనేక పట్టణాల్లోని నివాస గృహాలు కాలుష్యానికి ఆలవాలమై పోయాయని ఆనివేదిక స్పష్టం చేస్తుంది.

ఇంట్లో ఉన్న కాలుష్య కారకాలను నియంత్రించుకోవడం ప్రస్తుతం మనముందున్న కర్తవ్యం. కొన్ని జాగ్రత్తలు చర్యలు పాటిస్తే దీని నుంచి సులభంగా బయటపడవచ్చు. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు కొత్త అలవాట్ల కారణంగా చాలా మంది ఏరి కోరి సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. నివాసాల్లో ప్లాస్టీక్ వినియోగం తగ్గించటం ఉత్తమమని నిపుణులు సైతం సూచిస్తున్నారు. కార్పెట్లు, కర్టెన్లు, పెంపుడు జంతువులు ఇలాంటి వాటి వల్ల ఇంట్లో కాలుష్యం ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

కాలుష్యం కారకాల కారణంగా ఊపిరితిత్తుల జబ్బుల బారిన పడి చివరకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఇంట్లో కనిపించని కాలుష్యంతో క్యాన్సర్, ఆస్తమా, చర్మ సంబంధిత అలర్జీల బారిన పడి నరకయాతన అనుభవిస్తున్నారు. ప్లాస్టిక్‌ నుంచి వెలువడే మైక్రోప్లాస్టిక్స్‌ 0.1 ఎంఎం ఉంటాయి. సింథటిక్‌ కార్పొట్లు, ప్లాస్టిక్‌ డబ్బాలు తదితరలతో ఇవి ఉత్పన్నమవుతాయి. ఇవి ఆరోగ్యానికి హానికలిగిస్తూ ప్రాణాలు హరిస్తున్నాయి.

ఇంట్లో మంచి సువాసన కోసం వెలిగించే దూఫ్ స్టిక్స్ సైతం కాలుష్యకారకాలుగా చెప్పవచ్చు. ఇవి వెదజల్లే పొగలో ప్రమాదకరమైన కాలుష్యకారకాలు ఉండి అనేక ఆరోగ్యసమస్యలను తెచ్చిపెడతాయి. వీటి వల్ల జలుబు, దగ్గు, న్యుమోమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌,శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇంట్లోనే ఉంటుండడంతో వారిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతాయి.

ఇంట్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏంచేయాలంటే…

వాతావరణం, ఇంట్లోని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇంటి పరిసరాల్లో చుట్టూ మొక్కలు పెంచుకోవటం మంచిది. ఇంటి లోపలకు బయట నుండి వచ్చే వాయు కాలుష్యాన్ని మొక్కలు కొంతమేర నిలువరిస్తాయి. మొక్కలు స్వస్ఛమైన గాలిని, ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఇంట్లో ఉండే వారికి ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇంటి లోపలి భాగంలో సైతం కుండీల్లో పెంచే చిన్నచిన్న మొక్కలు పెంచుకోవాలి. ఇలా చేయటం వల్ల కాలుష్య నివారణతోపాటు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని మొక్కలు గాలిలోని విషపదార్థాలను తొలగించగలవు.

ఇంట్లోకి గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి. ఇంటిలోపలికి సూర్యకిరణాలు పడేలా చేస్తే లోపల ఉండే సూక్ష్మజీవులు చనిపోయేందుకు అవకాశం ఉంటుంది. కార్పెట్లు, డోర్ కర్టెన్లు ఎప్పటికప్పుడు దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. వీటిలో కాలుష్య కారకాలు దాగి ఆస్మ వంటి శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి. ముఖ్యంగా చిన్నారులు వీటి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ధూమపానం వల్ల వాయు కాలుష్యం ఏర్పడే అవకాశాలు అధికంగానే ఉంటాయి. ఇంట్లో పోగుపడే పొగ.. అంతర్గతంగా గాలి నాణ్యత మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వెంటిలేషన్ సరిగా లేకుంటే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ఇంటి తలుపులు, కిటికీలు రోజుల్లో కొద్ది సమయాలపాటు తెరచుకుంటే మంచిది. వంట చేసే సమయంలో , స్నానం చేసేటపుడు. కాలుష్యకాలను తొలగించటానికి, గాలిలో తేమను తగ్గించటానికి ఎక్ట్రాక్టర్‌ను ఆన్ చేయటం మంచిది. ఇంట్లో వాయు కాలుష్యం నివారించాల్సిన కర్తవ్యం మనందరి ముందు ఉంది.