Plane Door Blows Out : 16 వేల అడుగుల ఎత్తులో ఉండ‌గా.. ఊడిన విమానం డోర్‌.. 171 మంది ప్ర‌యాణికులు.. భ‌యాన‌క అనుభ‌వం

అల‌స్కా ఎయిర్ లైన్స్ బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం 16వేల అడుగుల ఎత్తులో ఉండ‌గా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Plane Door Blows Out Mid Air

Alaska Airlines : అల‌స్కా ఎయిర్ లైన్స్ బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం 16వేల అడుగుల ఎత్తులో ఉండ‌గా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. స‌డెన్‌గా ఓ డోర్ ఊడిపోయింది. దీంతో ప్ర‌యాణీకులు భ‌య‌బ్రాంతుల‌కు గురైయ్యారు. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన పైల‌ట్లు విమానాన్ని అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ లో చోటు చేసుకుంది.

అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ సిటీ నుంచి ఏఎస్‌1282 విమానం ఒంటారియోకు శుక్ర‌వారం సాయంత్రం బ‌య‌లుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల త‌రువాత ఓ డోర్ ఊడిపోయింది. ఆ స‌మ‌యంలో విమానంలో 171 మంది ప్ర‌యాణీకులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వెంట‌నే విమానాన్ని వెన‌క్కి మ‌ళ్లించి తిరిగి పోర్ట్‌ల్యాండ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో సుర‌క్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్ర‌యాణీకులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Plane Crash : కరేబియన్ సముద్రంలో కూలిన చిన్న విమానం…హాలీవుడ్ నటుడు, అతని ఇద్దరు కూతుళ్ల మృతి

ఈ ఘ‌ట‌న పై అల‌స్కా ఎయిర్ లైన్స్ స్పందించింది. పోర్ట‌లాండ్ నుంచి ఒంటారియో విమానం బ‌య‌లు దేరిన కొద్ది స‌మ‌యం త‌రువాత స‌మ‌స్య త‌లెత్తింద‌ని చెప్పింది. దీంతో విమానాన్ని వెనక్కి మ‌ళ్లించి సుర‌క్షితంగా ల్యాండ్ చేసిన‌ట్లు తెలియ‌జేసింది. ఆ స‌మ‌యంలో విమానంలో 171 మంది ప్ర‌యాణికుల‌తో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నార‌ని, ఈ ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. ఎగ్జిట్ డోర్ గాల్లో ఎగిరిపోవ‌డాన్ని ప్ర‌యాణీకులు వీడియోలు తీశారు. ఈ వీడియోల్లో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుండి పూర్తిగా విడిపోయినట్లు క‌నిపిస్తోంది. ఆ స‌మ‌యంలో ప్ర‌యాణికుల చేతుల్లో ఉన్న ఫోన్లు గాలిలో ఎగిరిపోయిన‌ట్లు తెలుస్తోంది.

చ‌నిపోతాం అనుకున్నాం..

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై 22 ఏళ్ల ప్ర‌యాణికుడు న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడాడు. ఇది ఎంతో భ‌యాన‌క అనుభ‌వం అని చెప్పాడు. ఇది ఓ పీడ‌క‌ల‌గా మిగిలిపోతుంద‌న్నాడు. ఆ స‌మ‌యంలో తాను చ‌నిపోతాన‌ని అనుకున్న‌ట్లు తెలిపాడు.

Bangladesh : బంగ్లాదేశ్ బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం…నలుగురు మృతి