Pakistan Price Minister
Pakistan Prime Minister : పాకిస్తాన్ ప్రధానిపై అక్కడి మీడియా పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ఇంటి ఖర్చులపై పాకిస్తాన్ పత్రికలు ప్రచురించిన కథనాలు ఆ దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇమ్రాన్ స్నేహితుడు, సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ వజీవుద్దీన్ అహ్మద్, ఇమ్రాన్ ఖాన్ ఇంటి విషయాలను బయటపెట్టాడు. నెలకు ఇమ్రాన్ ఇంటి ఖర్చులు 50 లక్షలు అవుతుందని, అతడు నిజాయితీ పరుడు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ నిజాయితీపరుడనుకుంటే పప్పులో కాలేసినట్లేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన జహంగీర్ తరీన్ ప్రతి నెలా ఆయనకు 50 లక్షల రూపాయలను పంపుతారని ఆయన పేర్కొన్నారు.
చదవండి : Pakistan PM Imrankhan: కశ్మీర్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇమ్రాన్ అధికారంలో లేని సమయంలో నెలకు 20 లక్షలు ఖర్చయ్యేవని, ఆ తర్వాత 30 లక్షలు.. ప్రస్తుతం 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని.. తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నిజాయితీపరుడనుకుంటే మీ భ్రమే అవుతుంది. ఆయను అత్యంత దగ్గరిగా నేను చూశా. కొన్ని రోజుల పాటు ఇమ్రాన్ ఇంటి ఖర్చుల వ్యవహారం జహంగీర్ తరీనే చూసేవాడిని వజీవుద్దీన్ అహ్మద్ పేర్కొన్నారు. ఇక వజీవుద్దీన్ వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు కొట్టిపడేస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నాయి. దేశం ఆర్థికంగా చితికిపోతుంటే ప్రధాని విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రజాధనం వృధా చేస్తున్నాడని మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు
చదవండి : Pakistan : నలుగురు మహిళల్ని వివస్త్రలను చేసి దారుణంగా కొట్టారు
చదవండి : Pakistan Man Crossed Border : భారత్ లో ప్రేయసి కోసం..బోర్డర్ దాటిన పాక్ యువకుడు అరెస్ట్