Paris Postcard
Paris Postcard : ప్యారిస్ నుంచి 1969 లో పంపిన పోస్ట్ కార్డ్ ఒకటి 2023 జూలై 19 న అందుకున్న జెస్సీకా అనే మహిళ ఆశ్చర్యపోయింది. మొదట ఆమె ఆ కార్డ్ రాంగ్ అడ్రస్ కి డెలివరీ అయ్యింది అనుకున్నారు. అయితే ఆ పోస్ట్ కార్డ్ వివరాలేంటి?
US Man new record : నీటి అడుగున 100 రోజులు.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఆ వ్యక్తి ఎవరంటే?
జెస్సీకా మీన్స్ 17 సంవత్సరాలుగా తన పోర్ట్ ల్యాండ్ హోంలో ఉంటున్నారు. అయితే ఆమెకు 1969 నాటి పోస్ట్ కార్డ్ ఒకటి మెయిల్ బాక్స్‌కి వచ్చింది. మొదట ఆమె తప్పు చిరునామాకు డెలివరీ అయ్యిందని అనుకున్నారట. తరువాత తన పొరుగువారికి వచ్చిందని కూడా అనుకున్నారట. ఆ తరువాత తాను ఉంటున్న ఇంటి పాత యజమానులకు వచ్చినదిగా ఆమె గ్రహించారట. ప్యారిస్‌లోని ఆర్క్ టి ట్రియోఫే ఫోటోతో ఉన్న పోస్ట్ కార్డ్‌లో మిస్టర్ అండ్ మిసెస్ రెనె.ఎ గాగ్నోన్ అనే వ్యక్తిని ఉద్దేశించి రాయ్ అనే వ్యక్తి సంతకం చేశారు. పోస్ట్ కార్డ్ మార్చ్ 15, 1969 నుండి ఫ్రెంచ్ మార్క్ ను చూపిస్తోంది. కొత్త స్టాంప్ జూలై 12, 2023 పోస్ట్ మార్క్‌తో ఉంది. పంపిన వారు ఎవరైనా ప్రస్తుత నివాసి అని కావాలని రాసినట్లు తెలుస్తోంది.
1905 లో క్యూబెక్ లో జన్మించిన రెనె.ఎ గాగ్నోన్ 1988 లో చనిపోయారు. అతని భార్య రోజ్ రాచెల్ గాగ్నోన్ 2002 లో 90 ఏళ్ల వయసులో మరణించారు. రెనే గాగ్నాన్ సంస్మరణలో అతని కుమార్తె సాల్జ్‌మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ జంట 1988 లో బెల్జియంలో ఉన్నారు. ఇతర బంధువులు ఫ్లోరిడాలో ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అంటే ఆ బంధువులలో ఒకరు పాత పోస్ట్ కార్డుని చూసి దానిని తన అడ్రస్‌కి మెయిల్‌లో పెట్టారని జెస్సీకా చెబుతోంది.
ఈ పోస్ట్ కార్డ్‌ని జెస్సీకా ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టారు. ‘జూలై 12 న పోస్ట్ కార్డుపై స్టాంప్ వేసి మెయిల్ చేసిన వారికి నిజంగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఎవరికైతే పంపారో వారు చనిపోయి చాలా కాలం అవుతోంది అని వారికి తెలుసు. అయినా దానిని ఎందుకు నాకు పంపించారో తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటూ ఆ కార్డ్‌ని షేర్ చేసారు. ఈ పోస్ట్ కార్డ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.