US Man new record : నీటి అడుగున 100 రోజులు.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఆ వ్యక్తి ఎవరంటే?
ప్రపంచానికి దూరంగా.. నీటిలో 30 అడుగుల క్రింది భాగంలో.. 100 రోజులు ఉండటం అంటే ? అమ్మో అంటాం. ఇప్పటికే ఇలా ఉండి రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి వారందరి రికార్డ్‌ను చెరిపేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.

US Man new record
Viral News : నీటి పైన ఈత కొడుతూ.. స్నానం చేస్తూ సరదాగా చాలామంది గడుపుతారు. కానీ నీటి అడుగున 100 రోజులు ఉండగలరా? అలా ఉండి దాని పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టాడు ఓ వ్యక్తి.. ఎవరతను.. ? తెలుసుకోవాలని ఉందా.. చదవండి.
Dance in under water : ఆక్సిజన్ లేకుండా 10మీటర్ల లోతు నీటి అడుగున డ్యాన్స్
జో డిటూరి అనే వ్యక్తి గతంలో US లో నేవీ డ్రైవర్ పనిచేశాడు.. అంతేకాదు అతను బయో మెడికల్ ఇంజినీరింగ్‌లో నిపుణుడు. అతనికి సముద్రంలో జీవించడం, కొతవాటిని అన్వేషించడం అంటే ఇష్టమట. అందుకోసం గతంలో నీటి అడుగున 74 రోజులు గడిపి రికార్డ్ సాధించిన US పరిశోధకుడి రికార్డును చెరిపేయాలనుకున్నాడు. తన రికార్డు కోసం ఫ్లోరిడా కీస్ సమీపంలోని ఉపరితంలో 30 అడుగుల కింద ఉన్న 55 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని సెలక్ట్ చేసుకున్నాడు. అనుకున్నట్లే 100 రోజులు నీటి అడుగున ఉండి కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. డిటూరి తన అనుభవాన్ని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
‘ఈ అనుభవం నా జీవిత గమనాన్ని ఎంతగానో మార్చింది.. కొత్తగా పరిశోధనలు చేయాలనుకునే వారికి నా రికార్డ్ ప్రేరణ అవుతుందని నమ్ముతున్నాను’ అనే శీర్షికతో డిటూరి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (drdeepsea) పోస్టు పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై చాలామంది కామెంట్స్ చేశారు. డిటూరి నీటి అడుగున చేసిన పరిశోధన గురించి తెలుసుకోవాలని ఉందంటూ ప్రశ్నించారు.
View this post on Instagram