Dance in under water : ఆక్సిజన్ లేకుండా 10మీటర్ల లోతు నీటి అడుగున డ్యాన్స్

Dance in under water : ఆక్సిజన్ లేకుండా 10మీటర్ల లోతు నీటి అడుగున డ్యాన్స్

Under Water Dance

Dancer ariadna hafez dance in under water : స్టేజీమీద డ్యాన్సులు చూశాం. గల్లీల్లో డ్యాన్సులు చూశాం. రోడ్డులమీద డ్యాన్సులు చూశాం. కానీ నీళ్లలో డ్యాన్స్ చేయటం చూశారా? నీళ్లల్లో డ్యాన్స్ చేయటంమంటే ఏదో మోకాలులోతు నీళ్లల్లో చేయటం కాదు. నీటిలో 10 మీటర్ల అడుగున మ్యూజిక్ కు అనుగుణంగా లయబద్దంగా డ్యాన్స్ వేసింది ఓ మహిళ. అదికూడా ఆక్సిజన్ లేకుండా బాటిల్ కూడా పెట్టుకోకుండా..నీళ్ల అడుగున ఒక్క నిమిషం కూడా ఉండలేం. అటువంటిది కెమెరా యాంగిల్స్, మ్యూజిక్, స్టెప్స్ వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడా మిస్ అవ్వకుండా డ్యాన్స్ చేయటం అంటే మాటలు కాదు. అదికూడా ఆక్సిజన్ టిన్ సౌకర్యం కూడా లేకుండా..

ఫ్రాన్స్ కు చెందిన బాస్టియన్ సోలైల్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ వీడియో నీటిలో 10 మీటర్ల అడుగున షూట్ చేశారు. స్వీయ కొరియోగ్రఫీతో అరియాడినో హఫీజ్ అనే డ్యాన్స్ ర్ వాటర్ అడుగున డ్యాన్స్ చేసింది. నీటి అడుగుభాగంలో ఈ డ్యాన్స్ కోసం వారు ఎటువంటి ఆక్సిజన్ పరికరాలూ ఉపయోగించకపోవటమే విశేషం. షూట్ చేస్తున్న సమయంలో యూనిట్ సభ్యులంతా 120 సార్లు ఆ నీటి నుంచి బయటకు రావాల్సి వచ్చిందట. ఆక్సిజన్ పీల్చుకోవటం కోసం. 10 మీటర్ల నీటి అడుగున దాదాపు మూడు నిమిషాల పాటు ఆమె డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ అంటే ఎదో కాలూ చేయీ కదిపేసి మమ అనిపించడం కాదు. వస్తున్న సంగీతానికి అనుగుణంగా.. రిథమిక్ గా వెరైటీ చూపిస్తూ ఆమె చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ డ్యాన్స్ కు చక్కటి లైటింగ్ మరో ఆకర్షణ. దానికి తగినట్లుగా కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్.. చిన్న సెట్ నీటి అడుగుభాగాన ఏర్పాటు చేసి తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ వీడియోను చాలా మంది చూసినవాళ్లు క్యా డ్యాన్స్, క్యా షూటింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు.

వాట్ లో అద్భుతమైన డ్యాన్ చేసిన తన అత్యద్భుతమైన నాట్య భంగిమలతో అందరి మన్ననలు పొందుతోంది అరియాడినో హాఫీజ్. ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. ఆమె డ్యాన్స్ వీడియో చూసిన నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు. వారెవ్వా అంటూ ఆమె చేసిన విన్యాసానికి ఫిదా అవుతున్నారు. హాఫీజ్ డ్యాన్స్ వీడియోలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.కానీ ఈ వీడియో మాత్రం వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు ఆమె అభిమానులతో పాటు చూసినవారంతా..