H1B, L1 వీసాలకు తాత్కాలిక విరామం-కరోనా ఎఫెక్ట్ 

అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్‌–1బీ, ఎల్‌–1 , ఇతర తాత్కాలిక వీసాల జారీపై మరిన్ని కఠిన తరమైన ఆంక్షలు విధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కోన్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల రాకపై నియంత్రణ విధిస్తే,  దేశంలోని స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఒక న్యూస్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ… ఒకట్రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులపై సంతకం చేస్తానన్నారు. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపించనుంది. ఏటా జారీ చేసే 85 వేల హెచ్‌–1బీ వీసాల్లో 70శాతం ఇండియన్‌ టెక్కీలే దక్కించుకుంటున్నారు.

అయితే ఈ ఈ వీసాల అనుమతుల్లో కచ్చితంగా కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. చాలా ఏళ్లుగా అమెరికాలో ఉండి వ్యాపారాలు చేసే సంస్థలకు సంబంధించి ఎంతో కొంత మినహాయింపులు ఇస్తామని సూచన ప్రాయంగా ట్రంప్ చెప్పారు. కానీ మొత్తంగా చూస్తే వీసా విధానాన్ని బాగా కఠినతరం చేస్తామని… కరోనా వైరస్‌ కారణంగా అమెరికాలో కనీవినీ ఎరుగని స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే, విదేశీయులకు అడ్డుకట్ట తప్పనిసరి’’అని ట్రంప్‌ అన్నారు.

ట్రంప్‌ నిర్ణయంతో ఇండియన్‌ సర్వీసు కంపెనీల కంటే అమెరికా టెక్‌ సంస్థలపై ప్రభావం అధికంగా చూపించనుంది. గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీల్లో భారత్‌ సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులైన టెక్కీలకు హెచ్‌–1బీ ద్వారా ఉద్యోగాల్లో తీసుకుంటున్నారు. ఇక ఇండియన్‌ సంస్థలు స్థానిక అమెరికన్లకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో హెచ్‌–1బీతో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చునని ఇమిగ్రేషన్‌ లాయర్లు వెల్లడించారు.  అమెరికా పౌరసత్వం మరియు ఇమిగ్రేషన్‌ సర్వీసు గణాంకాల ప్రకారం 2016–19 మధ్య హెచ్‌–1బీలో భారత కంపెనీల వాటా 51% నుంచి 24%కి తగ్గిపోయింది.

అమెరికా వెళ్లి డాలర్లు సంపాదిద్దామని కలలు కంటున్న వారు ఇక ఈ ఏడాదికి  ఆశలు వదులుకోవటమే బెటర్. కోవిడ్‌–19తో అల్లాడిపోయిన అగ్రరాజ్యంలోనూ నిరుద్యోగం రేటు కనీవినీ ఎరుగని స్థాయిలో 4.1శాతం నుంచి 13.5శాతానికి పెరిగిపోయింది.  కంప్యూటర్‌కు సంబంధించిన రంగాలలో నిరుద్యోగం రేటు 2020 జనవరిలో 3% ఉంటే,  అది మే నాటికి 2.5% తగ్గింది. విదేశాల నుంచి నిపుణులైన పనివారిని తీసుకోకపోతే అమెరికా ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే ఎన్నో టెక్కీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read: కరోనా వైరస్ కాదది…చైనీస్ కుంగ్​ ఫ్లూ