Viral: సింహాల గుంపుకు చుక్కలు చూపెట్టిన చిట్టిపీత..డీలా పడ్డ ‘కింగ్ ఆఫ్ ది జంగిల్’

ఓ చిన్నపీతను ఏదో చేద్దామని వెళ్లిన సింహాల గుంపు దాని ముందు భంగపడింది. చిన్న పీతే కదాని అనుకున్న సింహాల గుంపు ఆ పీతను ఏమీ చేయలేక చూస్తుండి పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Viral: సింహాల గుంపుకు చుక్కలు చూపెట్టిన చిట్టిపీత..డీలా పడ్డ ‘కింగ్ ఆఫ్ ది జంగిల్’

Pride Of Lions Gets Spooked By Little Crab

Updated On : July 1, 2021 / 11:30 AM IST

Pride of lions gets spooked by little crab : చిట్టిదానా ఛీ..పొట్టిదానా ఫో అంటూ ఓ పర్వతం చిట్టి ఉడుతను గేలి చేసి భగంగపడిన కథ గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. అటువంటిదే మరొక రియల్ స్టోరీ గురించి తెలిస్తే ‘కింగ్ ఆఫ్ ది జంగిల్’ అనే సింహం కాదు కాదు సింహాల గుంపు చిన్న పీతను ఏమీ చేయలేకపోయాయే అనిపిస్తుంది. చిన్న పీతను ఏమీ చేయలేక వదిలేసిన సింహాల గుంపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ‘చిన్నదాన్ని కదాని చులకనగా చూడకు’అనేలా ఒక చిన్న పీత సింహాల గుంపుకు పాఠం నేర్పించినట్లుగా ఉందీ వీడియోలో..

అడవికి రాజు సింహం అంటాం. ఎందుకంటే సింహ ఠీవీ..రాజసం..ధైర్యం సాహసాలు అటువంటివి. అందుకే సింహాన్ని అడవి రాజు అని పిలుస్తారు. సింహం ముందు పెద్ద జంతువులు కూడా ప్రణమిల్లుతాయి. అటువంటి సింహమే ఒక చిన్న పీతను ఏమీ చేయలేకపోయింది. సింహం అంటూ ఒక్కటి కాదు ఏకంగా సింహాల గుంపు ఒక చిన్న పీతను ఏమీ చేయలేక చోద్యం చూస్తుండిపోయాయి.

దక్షిణాఫ్రికాలోని గేమ్ రిజర్వ్‌లో ఓ చిన్న పీత నడుచుకుంటూ వెళుతోంది. దాన్ని ఓ సింహం చూసింది. మహా ఠీవీగా ఆ పీత దగ్గరకెళ్లింది. కానీ ఆ పీత ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే దానికి సింహం గురించి తెలియదు కాబోలు..మరి తెలిసినా ‘నువ్వు అడవికి రాజు అయితే నాకేంటీ’అన్నట్లుగా సింహం తన దగ్గరకొచ్చిన భయంకరంగా చూసినా ఆ పీత భయపడలేదు. పైగా తనకు రక్షణగా ఉండే ముందు కాళ్లను (డెక్కలు అంటారు)ఎత్తి సింహం వైపు చూపించింది. దగ్గరకొస్తే నా డెక్కలతో నొక్కేస్తా అన్నట్లుగా..అలా రెండు కాళ్లను ఎత్తి పెట్టి తన దారిని తాను వెళుతూనే ఓ వైపు సింహం వైపు ఓ కన్ను వేసి నడుస్తుంటుంది పీత.

ఆ తరువాత ‘ఆ చిన్న పీతను చోద్యం చూస్తున్నావ్..ఒక్క పంజా విసిరితే పచ్చడైపోద్ది అన్నట్లుగా ఆ సింహం దగ్గరకు మరో రెండు మూడు సింహాలు వచ్చాయి. పీత పని పడదామని..కానీ పీత ఎన్ని సింహాలు వచ్చినా భయపడలేదు. దాని నడక ఆపనూలేదు. అలా పీతను సింహాల గుంపు వెంబడించింది.

పీత అలా వెళుతూ వెళుతూ..సేఫ్టీ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. దాన్ని ఏదో చేద్దానమి అనుకున్న సింహాల గుంపు మాత్రం ఏమీ చేయలేకపోయింది. అదన్నమాట సింహాల గుంపునుంచి ఓ చిన్న పీత ఎలా తప్పించుకుందో..అడవికి రాజు అయినా సింహాల గుంపు మాత్రం ఆ పీతను ఏమీ చేయలేకపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాల వైరల్ అయి నెటిజన్లు మనసు దోచుకుంటోంది. వేలకొద్దీ వ్యూస్ లైకులు వస్తున్నాయి ఈ వీడియోకు..ఈ వీడియో చూసాక ‘హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటావ్..నా ట్రాకే సెపరేటు’అంటూ డైలాగ్ కింగ్ మోహన్ బాబు డైలాగ్ గుర్తుకొస్తుంది.