Princess Diana niece Lady Kitty Spencer Wedding
Princess Diana’s niece Lady Kitty Spencer Wedding : ప్రిన్సెస్ డయానా. పరియం అవసరం లేని ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన అత్యద్భుతమైన మహిళ. వారి వంశంలోనే కొంతమంది గురించి చెప్పాలంటే ఈనాటికి ప్రిన్సెస్ డయానా పేరుతోనే చెప్పుకుంటాం. అంతటి పేరున్న వ్యక్తి ప్రిన్సెస్ డయానా. ఇప్పుడు కూడా ఆమె పేరుతోనే ఆమె మేనకోడలు వివాహం గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. సాధారణంగా రాజవంశంలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా అవి విశేషాలే. కానీ ప్రిన్సెస్ డయానా మేనకోడలి వివాహం మాత్రం సంచలనమైంది. ఎందుకంటే లేడీ కిట్టీ స్పెన్సర్స్ 62 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకోవడం.లేడీ కిట్టీ.. ప్రిన్సెస్ డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ కుమార్తె.
మూడు పదుల వయసు కూడా దాటని ప్రిన్సెస్ డయానా మేనకోడలు లేడీ కిట్టీ స్పెన్సర్స్ 62 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. వీరిద్దరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కిట్టీ పెళ్లాడిన ఆ 62 ఏళ్ల వృద్ధుడి పేరు మైఖేల్ లూయిస్. దక్షిణాఫ్రికాకు చెందిన ఆయన ఫ్యాషన్ వ్యాపారవేత్త.వేలాది కోట్ల శ్రీమంతుడు. మైఖేల్ కు కిట్టీకి 2018 నుంచే పరిచయముంది.
వీరిద్దరి వయస్సు మధ్యా చాలా తేడా ఉన్నా ప్రేమకు వయస్సు అడ్డురాదు అన్నట్లుగా వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో జులై 24,2021న ఇటలీలోని ప్రాస్కాటిలోని విలలా అల్డోబ్రాండినిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.నవ్వుతూ తుళ్లుతూ మైఖేల్ తో కిట్టీ ఎంతో సంతోషంగా ఉంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డోల్స్ అండ్ గబ్బానా రూపొందించిన గౌన్లు ధరించిన కిట్టీ పెళ్లి వేడుకలో దేవకన్యలా కనువిందు చేస్తూ మెరిసిపోయింది.