Putin martial law in Ukraine : యుక్రెయిన్‌లో రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో మార్షల్‌ లా ప్రకటించిన పుతిన్ .. స్థానికుల ఫోన్లు తనిఖీలు

ఉక్రెయిన్ పై పుతిన్ దూకుడు పెంచారు. ఇప్పటికే యుక్రెయిన్ లో కొన్ని ప్రావిన్స్ లోను స్వాధీనం చేసుకున్న రష్యా ఆ ప్రాంతాల్లో మార్షల్ లా (మిలటరీ రూల్)ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు పుతిన్. ఆ ప్రాంతాల్లో స్థానికుల ఫోన్లు తనిఖీలు చేస్తున్నారు.

Putin martial law in Ukraine : ఉక్రెయిన్ పై పుతిన్ దూకుడు పెంచారు. ఇప్పటికే యుక్రెయిన్ లో కొన్ని ప్రావిన్స్ లోను స్వాధీనం చేసుకున్న రష్యా ఆ ప్రాంతాల్లో మార్షల్ లా (మిలటరీ రూల్)ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు పుతిన్. ఆ ప్రాంతాల్లో స్థానికుల ఫోన్లు తనిఖీలు చేస్తున్నారు.రష్యా ఆక్రమించిన నాలుగు రీజియన్లలో మార్షల్‌ లా(మిలటరీ రూల్‌)ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు.

ఉక్రెయిన్‌ దక్షిణాదిలోని ఖెర్సోన్‌, జాపొరిజియా లుహాన్స్క్‌, డోనెట్స్క్‌ను తమ భూభాగంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ఇప్పటికే ప్రకటించింది. ఈక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆ నాలుగు రీజియన్లలో మార్షల్‌ లా ప్రకటించారు. క్రిమియా మధ్యలో ఉన్న బ్రిడ్జి కూల్చివేతపై పుతిన్‌ యుక్రెయిన్ పై ఫుల్ ఫైర్ మీదున్నారు. దీని ఫలితంగా రష్యా బలగాలు మరింతగా యుక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. క్రిమియా బ్రిడ్జి కూల్చివేతకు ప్రతీకారంగా కీవ్‌ సహా కీలక నగరాలపై క్షిపణి, సూసైడ్‌ డ్రోన్‌ దాడులతో విరుచుకుపడతున్నాయి రష్యా బలగాలు.

యుక్రెయిన్‌లోని నాలుగు ఆక్రమిత ప్రాంతాలలో యుద్ధ చట్టాన్ని అమలు చేస్తూ రష్యా ప్రకటించడంపై యుక్రెయిన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. యుక్రేయిన్ వాసుల ఆస్తులను దోచుకోవడానే ‘మార్షల్ లా’ విధించారని.. యుక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ ఆరోపించారు. పుతిన్ చేసిన ఈ సంచలన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు జాపొరిజియా అణు విద్యుత్తు ప్లాంట్‌కు చెందిన 50 మంది ఉద్యోగులను రష్యా బలగాలు అపహరించాయని..వారిలో కొందరిని విడిచిపెట్టాయని ఉక్రెయిన్‌వర్గాలు తెలిపాయి. కాగా భారతీయులు యుక్రెయిన్‌ వెళ్లొద్దంటూ భారత ప్రభుత్వం సూచించింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు వెంటనే తిరిగి రావాలని బుధవారం (అక్టోబర్ 2022)ట్రావెల్‌ అడ్వయిజరీని విడుదల చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు