Putin
Ukraine next President: యుక్రెయిన్ ను బలవంతంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో సంచలనానికి పునాది వేశారా?. అంటే అవుననే అంటున్నారు యూరోప్ లోని రాజకీయ విశ్లేషకులు. తమ హెచ్చరికలను కాదని యుక్రెయిన్ నాటోలో చేరడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పుతిన్.. అందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు భారీ మూల్యం చెల్లించుకోవాలనంటూనే.. ఆ దేశంపై దండెత్తి వెళ్లారు. ఇప్పటికే యుక్రెయిన్ లోని ప్రధాన నగరాలను రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోగా..ఇక ఆ దేశ పాలనాపరమైన అంశాల్లోనూ పుతిన్ జోక్యం చేసుకుంటున్నారు. యుక్రెయిన్ ను వశం చేసుకున్న అనంతరం ఆదేశానికి అధ్యక్షుడిగా విక్టర్ యనుకోవిచ్ ను పుతిన్ ప్రకటించనున్నట్లు యుక్రెయిన్ కు చెందిన ప్రవాద అనే వార్త సంస్థ తెలిపింది.
Also read: PM Boris Johnson : అతడో యుద్ధ నేరస్తుడు.. పుతిన్‌పై బ్రిటన్ ప్రధాని ఫైర్
ఎవరీ విక్టర్ యనుకోవిచ్?
యుక్రెయిన్ మాజీ అధ్యక్షుడే విక్టర్ యనుకోవిచ్. 2010లో అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చారు, అయితే 2014లో దేశంలో హింసాత్మక నిరసనలు వెల్లువెత్తడంతో పదవీచ్యుతుడయ్యాడు. రష్యాతో సన్నిహిత సంబంధాలను కోరుతూ.. యూరోపియన్ యూనియన్ (EU)తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి విక్టర్ నిరాకరించాడు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా దేశంలో నిరసన జ్వాలలు చెలరేగాయి.
పుతిన్ కు సన్నిహితుడిగా చెప్పబడే యనుకోవిచ్‌ను అప్పట్లో తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సాగిన ప్రయత్నాలకు రష్యా నుంచీ మద్దతు లభించింది. అయితే యనుకోవిచ్ రష్యాకు ప్రయాణించే ముందు కైవ్ నుండి ఖార్కివ్‌కు పారిపోవడంతో అది విఫలమైంది. ఇక 2010లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు.. 2006 – 2007 మధ్య మరియు 2005కి ముందు కొద్ది కాలం పాటు యుక్రెయిన్ ప్రధానిగా కూడా యనుకోవిచ్ పనిచేశారు. అంతకముందు 1997 నుండి 2002 వరకు తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ఒబ్లాస్ట్‌కు గవర్నర్‌గా కూడా ఉన్నారు. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో డొనెట్స్క్ ను స్వతంత్ర ప్రాంతంగా రష్యా గుర్తించిన సంగతి తెలిసిందే.
Also read: Leave Kharkiv : కాలి నడకన అయినా సరే వెంటనే ఖార్కివ్ ఖాళీ చేయండి.. భారతీయులకు హెచ్చరిక
యనుకోవిచ్‌కి “యూరోమైదాన్”కి లింక్ ఏమిటి?
ఈయూ – యూక్రెయిన్ అసోసియేషన్ ఒప్పందంపై సంతకం చేయడానికి యనుకోవిచ్ నిరాకరించడంతో.. నిరసనకారులు యనుకోవిచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 2013లో కీవ్ లోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి.కీవ్ లోని మైదాన్ (సెంట్రల్ స్క్వేర్) వద్ద జరుగుతున్న భారీ నిరసనలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. సోషల్ మీడియా వేదికగా “యూరోమైదాన్” హ్యాష్‌ట్యాగ్ తో నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. నిరసనలు ప్రధానంగా సెంట్రల్ కీవ్ లోని మైదాన్ నెజాలెజ్నోస్టిలో జరిగాయి. ఇవి యనుకోవిచ్ వ్యతిరేక నిరసనలకు ర్యాలీ పాయింట్‌గా మారింది. చివరకు యనుకోవిచ్ దేశం విడిచి పారిపోవడంతో నిరసనకారులు విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు.
Also read: PM Modi: భారత్ శక్తివంతంగా తయారవుతుంది కాబట్టే “ఆపరేషన్ గంగా” సాధ్యమైంది: మోదీ
యనుకోవిచ్ వారసుడు ఎవరు?
పెట్రో పోరోషెంకో తర్వాత యుక్రెయిన్ లో ఒలెక్సాండర్ తుర్చినోవ్ అధికారంలోకి రావడంతో యనుకోవిచ్ దేశం విడిచివెళ్ళిపోయాడు. అయితే, ఆ సమయంలో ప్రముఖ TV స్టార్ మరియు హాస్యనటుడు అయిన జెలెన్స్కీ.. 2019లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో NATO సభ్యత్వంపై వెనక్కు తగ్గాలంటూ పుతిన్ ఒత్తిడి చేయడంతో జెలెన్స్కీ నొచ్చుకున్నాడు. రష్యా వ్యతిరేక వైఖరి అతనికి నచ్చలేదు. దీంతో ఇరు దేశాల మధ్య అంతరాలు తారాస్థాయికి చేరి చివరకు యుద్ధానికి దారి తీశాయి.
Also read: Ukraine-Russia: మూడో ప్రపంచం యుద్ధం అంటూ జరిగితే అది అణు యుద్ధమే: రష్యా విదేశాంగ మంత్రి