Leave Kharkiv : కాలి న‌డ‌క‌న అయినా సరే వెంటనే ఖార్కివ్‌ ఖాళీ చేయండి.. భారతీయులకు హెచ్చరిక

భారత పౌరులు, విద్యార్థులు... కాలి నడకన అయినా సరే.. వెంటనే ఖార్కివ్(Leave Kharkiv) వీడాల్సిందే.. ఇదీ.. యుక్రెయిన్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ తాజా ప్ర‌క‌ట‌న.

Leave Kharkiv : కాలి న‌డ‌క‌న అయినా సరే వెంటనే ఖార్కివ్‌ ఖాళీ చేయండి.. భారతీయులకు హెచ్చరిక

Kharkiv (1)

Leave Kharkiv : భారత పౌరులు, విద్యార్థులు… కాలి నడకన అయినా సరే.. వెంటనే ఖార్కివ్ వీడాల్సిందే..(Leave Kharkiv) ఇదీ.. యుక్రెయిన్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ తాజా ప్ర‌క‌ట‌న. యుక్రెయిన్ లోనే రెండో అతిపెద్ద నగరం, ఎడ్యుకేషనల్ హబ్ ఖార్కివ్. ఆ నగరంలోని భార‌త పౌరులు, విద్యార్థులు త‌క్ష‌ణ‌మే న‌గ‌రాన్ని వీడాలంటూ ఇండియ‌న్ ఎంబ‌సీ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఆ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన కాసేప‌టికే భార‌త రాయ‌బార కార్యాల‌యం నుంచి ఖ‌ార్కివ్‌లోని భార‌త విద్యార్థుల‌కు మ‌రో ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ఈ ప్ర‌క‌ట‌న‌లోనూ ఖ‌ార్కివ్‌ను త‌క్ష‌ణ‌మే వీడాల‌ని చెప్పిన ఎంబ‌సీ అధికారులు.. వాహ‌నాలు లేక‌పోయినా కాలి న‌డ‌క‌న అయినా స‌రే ఆ న‌గ‌రాన్ని త‌క్ష‌ణ‌మే వీడాలని సూచించారు. నిమిషాల వ్యవధిలో భారత ఎంబసీ అధికారులు చేసిన ప్రకటనలు చూస్తుంటే.. ఖార్కివ్ నగరానికి ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతేకాకుండా, తాము సూచించిన మూడు ప్రాంతాలు పెసోచిన్‌, బ‌బ‌యే, బెజ్ల్‌యుడోవ్‌స్కాల‌కు ఖ‌ార్కివ్ నుంచి ఎంత దూరం ఉంటుంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది. ఖ‌ార్కివ్ నుంచి పెసోచిన్ 11 కిలోమీట‌ర్ల దూరం ఉండ‌గా.. బ‌బ‌యే 12 కిలోమీటర్ల దూరంలో, బెజ్ల్‌యుడోవ్‌స్కా 16 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉన్నాయ‌ని ఎంబ‌సీ తెలిపింది. ఎలాగైనా, ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా సుర‌క్షితంగా ఉండాల‌నుకుంటే.. త‌క్ష‌ణ‌మే ఖ‌ార్కివ్‌ను వీడాల్సిందేన‌ని ఎంబ‌సీ అధికారులు భార‌త విద్యార్థుల‌ను హెచ్చ‌రిస్తూ కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే రెండు అడ్వైజ‌రీలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

Ukraine-Russia: మూడో ప్రపంచం యుద్ధం అంటూ జరిగితే అది అణు యుద్ధమే: రష్యా విదేశాంగ మంత్రి

ర‌ష్యా చేస్తున్న యుద్ధం కార‌ణంగా యుక్రెయిన్ లో భీతావ‌హ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. స్థానికులు, విదేశీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఇప్పటికే లక్షల మంది యుక్రెయిన్ వీడారు. మరోవైపు యుక్రెయిన్ లోని భార‌తీయుల త‌ర‌లింపు కోసం విదేశాంగ శాఖ నిర్విరామంగా కృషి చేస్తోంది. యుద్ధం మొద‌లై బుధవారం నాటికి వారం పూర్తి అవుతున్నా ర‌ష్యా బ‌ల‌గాలు ఇంకా వెన‌క్కు త‌గ్గ‌క‌పోగా.. యుక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను త‌మ స్వాధీనంలోకి తీసుకునేందుకు దాడుల‌ను మ‌రింత‌ ముమ్మరం చేసింది.

ఈ క్ర‌మంలో యుక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌రిస్థితి అంత‌కంత‌కూ క్షీణిస్తోంది. ఈ త‌ర‌హా ప‌రిస్థితుల నేప‌థ్యంలో యుక్రెయిన్ ప్ర‌ధాన న‌గ‌రం ఖ‌ార్కివ్‌లోని భార‌తీయుల‌కు యుక్రెయిన్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం కీల‌క సూచ‌న‌ జారీ చేసింది. ఉన్నప‌ళంగా ఖ‌ార్కివ్‌ను వ‌ద‌లాల‌ని, తాము చెప్పిన ప్ర‌దేశాల‌కు చేరుకోవాల‌ని ఇండియ‌న్ ఎంబ‌సీ సూచించింది.

Indian Student Death: యుక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి

రష్యా సమాచారం మేరకే ఖార్కివ్‌ నగరాన్ని తక్షణం వీడాలని భారతీయులకు ఇండియన్ ఎంబసీ సూచించింది. రవాణ సదుపాయం లేకపోయినా కాలినడకన అయినా సరే ఖార్కివ్‌ నగరం వీడాలంది. నగర శివార్లలోని పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లాలని సూచించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6గంటల వరకు తాము సూచించిన ప్రదేశాలకు చేరుకోవాలంది.

”భారతీయులను సురక్షితంగా సరిహద్దులకు తరలించేందుకు రష్యా నుంచి సమన్వయం చేస్తున్నాం. వచ్చే 24 గంటల్లో 15 విమానాలు ప్రణాళిక చేయబడ్డాయి. ఆపరేషన్ గంగలో భాగంగా వాయుసేన సీ-17 విమానాలు ఉపయోగిస్తున్నాం. ఇప్పటివరకు భారత్ కు చేరుకున్న 15 విమానాలు. సుమారుగా 3,352 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చాం. పాస్ పోర్టు పోగొట్టుకున్న భారతీయుల కోసం అత్యవసర ధ్రువీకరణ పత్రాలు అందజేసే వ్యవస్థను ఏర్పాటు చేశాం” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు.

యుక్రెయిన్, రష్యా మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. వరుసగా 7వ రోజూ రష్యా బలగాలు దాడులకు దిగాయి. యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. భారీ ఎత్తున దాడికి తెగబడిన రష్యాకు యుక్రెయిన్ నుంచి పెద్ద స్థాయిలోనే ప్రతిఘటన ఎదురవుతోంది. యుద్ధంలో యుక్రెయిన్ సైనికుల కంటే రష్యా సైనికులే ఎక్కువగా మృతి చెందినట్టు తెలుస్తోంది. గత 6 రోజుల్లో 6 వేల మంది రష్యా సైనికులను యుక్రెయిన్ మట్టుబెట్టింది. సైనికులను రవాణా చేసే 846 సాయుధ వాహనాలను ధ్వంసం చేసింది. 29 యుద్ధ విమానాలు, 29 హెలీకాప్టర్లు, 77 రష్యన్ ఆర్టిలరీ వ్యవస్థలను ధ్వంసం చేశారు. అంతేకాదు రష్యా పవర్ గ్రిడ్, రైల్వే వ్యవస్థలపై కూడా దాడి చేస్తున్నామని చెప్పారు. కాగా, యుక్రెయిన్ ను ఆక్రమించేంత వరకు దాడిని కొనసాగిస్తామని రష్యా తేల్చి చెప్పింది.