Indian Student Death: యుక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి

యుద్ధంలో నిండా మునిగిన యుక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. అయితే ఆ విద్యార్థి అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

Indian Student Death: యుక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి

Ukriane

Indian Student Death: యుద్ధంలో నిండా మునిగిన యుక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. అయితే ఆ విద్యార్థి అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రష్యాతో యుద్ధం కారణంగా చిన్నాభిన్నం అయిన యుక్రెయిన్ ను వీడి.. భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో సోమవారం కర్ణాటకకు చెందిన నవీన్ అనే విద్యార్థి యుక్రెయిన్ లో జరిగిన బాంబు దాడిలో మృతి చెందాడు. యుద్ధం నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం.. యుక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను త్వరితగతిన తిరిగి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఈక్రమంలో పంజాబ్ కు చెందిన 22ఏళ్ల చందన్ జిందాల్ అనే విద్యార్థి బుధవారం యుక్రెయిన్ లో మృతి చెందాడు. చందన్ జిందాల్.. విన్నిట్సియాలోని “విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీ”లో మెడిసిన్ చదువుతూన్నాడు.

Also read:Russia Soldiers : 6 రోజుల్లో 6వేల మంది సైనికులు మృతి.. రష్యాకు భారీ నష్టం 

మెదడులో ఇస్కీమియా స్ట్రోక్‌తో బాధపడుతున్న చందన్ జిందాల్ గత నెలలో.. స్థానిక ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతిచెందాడు. చందన్ జిందాల్ మృతి చెందిన సమయంలో అతని తండ్రి అక్కడే ఉన్నట్లు భారత అధికారులు తెలిపారు. కుమారుడి మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఆయన అక్కడి అధికారుల సహాయం కోరాడు. యుక్రెయిన్ – రోమానియా సరిహద్దులోని సిరెట్ అనే ప్రాంతానికి చేరుకుంటే అక్కడి నుంచి విమానాశ్రయానికి మృతదేహాన్ని తరలించవచ్చని చందన్ జిందాల్ పేర్కొన్నాడు. అయితే ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని ఎయిర్ అంబులెన్సు ద్వారా మాత్రమే సిరెట్ కు తరలించగలమని.. అధికారులు స్పందించి ఎయిర్ అంబులెన్సు ఏర్పాటు చేయాలనీ ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

Also read: Ukraine-Russia: మూడో ప్రపంచం యుద్ధం అంటూ జరిగితే అది అణు యుద్ధమే: రష్యా విదేశాంగ మంత్రి