Python fight with man
Python fight with man : సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవడానికి కొందరు చేసే స్టంట్లు చూస్తుంటే వణుకు పుడుతోంది. పాములతో సరదాకి పోతే ప్రాణాలే పోతాయి. ఓ వ్యక్తి కొండచిలువ గుడ్లు లాగడానికి ప్రయత్నించాడు. అతను ప్రయత్నించిన ప్రతి సారి అది కాటేయాలని చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Boy playing with a python : కొండచిలువతో ఆడుకుంటున్న పసివాడు.. పేరెంట్స్‌ని తిట్టిపోస్తున్న జనం
jayprehistoricpets అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కొండచిలువ పెట్టిన గుడ్లు తీసుకోవడానికి జూకీపర్ జే బ్రూవర్ అనే వ్యక్తి ప్రయత్నం చేసాడు. అతను గతంలో కూడా ఇలాంటి కొన్ని వీడియోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అతను షేర్ చేసిన వీడియో నెటిజన్లను భయపెట్టింది. ఏ క్షణంలో అయినా కొండచిలువ అతనిని కాటేస్తుందేమో అని భయం కలిగించింది. ఈ వీడియో ఒకరోజు క్రితం పోస్ట్ చేసారు. 5 లక్షల వ్యూస్ దాటి దూసుకుపోతోంది. ఇక చాలామంది ఈ వీడియోపై స్పందించారు.
‘అది విషపూరితమైనదా? జాగ్రత్త’ అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు. ఎంత పాముల సంరక్షణపై అవగాహన ఉన్నా పెంచేవారి పట్ల కూడా అవి ఒక్కోసారి కఠినంగా ప్రవర్తిస్తాయి. వాటిని రెచ్చగొట్టే విధంగా ఏ మాత్రం ప్రవర్తించినా ప్రాణాలు తీస్తాయి. సో కొండచిలువతో జాగ్రత్త అని నెటిజన్లు అతనికి సూచించారు.