Python Coils Leg : వ్యక్తి కాలుని చుట్టుకున్న కొండచిలువ.. అతడిని కాపాడేందుకు ఎంత కష్టపడ్డారో.. వీడియో

శంకర్ అనే వ్యక్తి పొలంలో కొండచిలువ ప్రవేశించింది. దాన్ని తరిమికొట్టేందుకు శంకర్ ప్రయత్నించాడు. ఆకస్మికంగా ఆ కొండచిలువ శంకర్ పైకి దూసుకొచ్చింది. అతడి కాలుని చుట్టుకుని కిందపడేలా చేసింది.

Python Coils Leg : వ్యక్తి కాలుని చుట్టుకున్న కొండచిలువ.. అతడిని కాపాడేందుకు ఎంత కష్టపడ్డారో.. వీడియో

Python Coils Leg : తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరులో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. తిరుపత్తూరులో 10 అడుగుల కొండచిలువ బెంబేలెత్తించింది. కైలాసగిరి గ్రామంలో శంకర్ అనే వ్యక్తి పొలంలో కొండచిలువ ప్రవేశించింది. దాన్ని తరిమికొట్టేందుకు శంకర్ ప్రయత్నించాడు. అయితే, శంకర్ ఒకటనుకుంటే, మరొకటి జరిగింది.

ఈ క్రమంలో కొండచిలువ అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. ఆకస్మికంగా ఆ కొండచిలువ శంకర్ పైకి దూసుకొచ్చింది. అతడి కాలుని చుట్టుకుని కిందపడేలా చేసింది. ఆ కొండచిలువ శంకర్ కాలుని బలంగా చుట్టుకుంది. దాన్ని నుంచి విడిపించుకోవడానికి శంకర్ చాలా ప్రయత్నం చేశాడు. కానీ, అతడి వల్ల కాలేదు. ఇరుగుపొరుగు వారు కూడా వచ్చారు. శంకర్ ని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా.. కొండచిలువను లాగలేకపోయారు.

Also Read.. Python Hulchul : వామ్మో.. ఎంత పే….ద్దగా ఉందో.. సత్యసాయి జిల్లాలో కొండచిలువ కలకలం

ఇక లాభం లేదనుకుని.. ఫైర్ అండ్ రెస్క్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. దాదాపు గంటపాటు శ్రమించి.. కొండచిలువ బారి నుంచి శంకర్ ను రక్షించారు. శంకర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, కొండచిలువ బలంగా కాలికి చుట్టుకోవడంతో శంకర్ భయపడిపోయాడు. అతడికి ప్రాణం పోయినంత పనైంది. అతడి బంధువులు కూడా బాగా భయపడ్డారు. శంకర్ ను ఎలా కాపాడాలో అర్థం కాక కంగారు పడ్డారు. చివరికి ఫైర్ అండ్ రెస్క్యూ అధికారులు వచ్చి కాపాడారు. కాగా, వాళ్లు కూడా చాలా కష్టపడ్డారు. కాలుని చుట్టుకున్న కొండచిలువను లాగేందుకు తీవ్రంగా శ్రమించారు. గంటపాటు పోరాటం చేశారు. చివరికి కొండచిలువను లాగేయగలిగారు. ఆ కొండచిలువను అటవీశాఖ అధికారులు అడవిలో వదిలిపెట్టారు.

ఈ ఘటన శంకర్ ను, అతడి కుటుంబసభ్యులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇక తన పని అయిపోందని శంకర్ అనుకున్నాడు. చావు ఖాయం అని ఫిక్స్ అయిపోయాడు. అయితే, అధికారులు రంగంలోకి దిగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

కాగా.. అడవుల్లో ఉండాల్సిన పాములు, కొండచిలువలు, క్రూర మృగాలు తరుచుగా జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి చొరబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఆహారం వెతుక్కునే క్రమంలో.. అవి.. ఇలా జనావాసాల మధ్యకు వస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నిసార్లు ప్రజల ప్రాణాలు పోతున్నాయి.

Also Read.. Python Swallowed The Woman : మహిళను మింగేసిన భారీ కొండచిలువ .. పొట్ట చీల్చి బయటకు తీసిన అధికారులు

కొండచిలువలు చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఒక్కోసారి చాలా ప్రమాదకరం కూడా. పాములతో పోలిస్తే ఇవి చాలా డిఫరెంట్. ఎలుకలు, చేపలు, కీటకాలు, బల్లులు, కప్పలు వంటి చిన్న జంతువులను పాములు తమ ఆహారంగా తింటాయి. పెద్ద జంతువుల జోలికి మాత్రం పాములు వెళ్లవు. అదే కొండచిలువ విషయానికొస్తే టోటల్ గా డిఫరెంట్. ఏది దొరికితే అది ఇట్టే పట్టేసుకుంటుంది. పట్టు వదలకుండా బలంగా చుట్టుకుని ఆహారంగా చేసుకుంటుంది. ఏకంగా మనిషినే మింగేయగలదు.