Python Hulchul : వామ్మో.. ఎంత పే….ద్దగా ఉందో.. సత్యసాయి జిల్లాలో కొండచిలువ కలకలం

సత్యసాయి జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. బుక్కపట్నం మండలం మారాల గ్రామంలోని ఓ రైతు మామిడి తోటలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. 15 అడుగుల పొడవున్న కొండచిలువ తోటంతా తిరుగుతూ రైతులను భయబ్రాంతుకు గురి చేసింది.

Python Hulchul : వామ్మో.. ఎంత పే….ద్దగా ఉందో.. సత్యసాయి జిల్లాలో కొండచిలువ కలకలం

Python Hulchul : సత్యసాయి జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. బుక్కపట్నం మండలం మారాల గ్రామంలోని ఓ రైతు మామిడి తోటలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. 15 అడుగుల పొడవున్న కొండచిలువ తోటంతా తిరుగుతూ రైతులను భయబ్రాంతుకు గురి చేసింది. సాధారణంగా పాముని చూస్తేనే వణుకు పుడుతుంది. అలాంటిది… ఏకంగా 15 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించేసరికి అంతా భయపడ్డారు. అక్కడి నుంచి పరుగులు తీశారు.

Also Read : Python Swallowed The Woman : మహిళను మింగేసిన భారీ కొండచిలువ .. పొట్ట చీల్చి బయటకు తీసిన అధికారులు

రైతులు.. అటవీశాఖ అధికారులకు, స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారుల సాయంతో స్నేక్ క్యాచర్ మూర్తి కొండచిలువను బంధించి అడవిలో వదిలిపెట్టాడు. దాంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. కొండచిలువను చూసి రైతులు, స్థానికులు హడలిపోయారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద కొండచిలువను చూడలేదని చెప్పారు.

అడవుల్లో ఉండాల్సిన పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి చొరబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఆహారం వెతుక్కునే క్రమంలో అవి.. ఇలా జనావాసాల మధ్యకు వస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Also Read : Australia-python: స్విమ్మింగ్ పూల్‌లో ఐదేళ్ల బాలుడిని చుట్టేసిన కొండచిలువ.. చివరకు..

కొండచిలువలు చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఒక్కోసారి చాలా ప్రమాదకరం కూడా. పాములతో పోలిస్తే ఇవి చాలా డిఫరెంట్. ఎలుకలు, చేపలు, కీటకాలు, బల్లులు, కప్పలు వంటి చిన్న జంతువులను పాములు తమ ఆహారంగా తినడం కామన్. పెద్ద జంతువుల జోలికి మాత్రం పాములు వెళ్లవు. అదే కొండచిలువ విషయానికొస్తే టోటల్ గా డిఫరెంట్. ఏది దొరికితే అది ఇట్టే పట్టేసుకుంటుంది. పట్టు వదలకుండా బలంగా చుట్టుకుని ఆహారంగా చేసుకుంటుంది. ఏకంగా మనిషినే మింగేయగలదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.