Australia-python: స్విమ్మింగ్ పూల్‌లో ఐదేళ్ల బాలుడిని చుట్టేసిన కొండచిలువ.. చివరకు..

ఓ ఐదేళ్ల బాలుడిని కొండ చిలువ కరిచి, చుట్టేసి, స్విమ్మింగ్ పూల్ లోకి లాగేసింది. అయినప్పటికీ ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ బాలుడి తండ్రి తాజాగా స్థానిక రేడియో స్టేషన్ కు చెప్పారు. బీ బ్లేక్ అనే బాలుడు ఇంటి వద్ద స్విమ్మింగ్ లో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడకు అతడి కంటే మూడు రెట్లు పెద్దగా ఉన్న 10 అడుగుల కొండచిలువ వచ్చి, ఆ బాలుడిని చుట్టేసింది.

Australia-python: స్విమ్మింగ్ పూల్‌లో ఐదేళ్ల బాలుడిని చుట్టేసిన కొండచిలువ.. చివరకు..

Australia-python

Australia-python:  ఓ ఐదేళ్ల బాలుడిని కొండ చిలువ కరిచి, చుట్టేసి, స్విమ్మింగ్ పూల్ లోకి లాగేసింది. అయినప్పటికీ ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ బాలుడి తండ్రి తాజాగా స్థానిక రేడియో స్టేషన్ కు చెప్పారు. బీ బ్లేక్ అనే బాలుడు ఇంటి వద్ద స్విమ్మింగ్ లో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడకు అతడి కంటే మూడు రెట్లు పెద్దగా ఉన్న 10 అడుగుల కొండచిలువ వచ్చి, ఆ బాలుడిని చుట్టేసింది.

ఈ విషయాన్ని గమనించిన బాలుడి తాత బాలుడిని పైకి లాగాడు. అయినప్పటికీ కొండచిలువ బాలుడిని వదలలేదు. దీంతో ఆ బాలుడిని అతడి తండ్రి బెన్ కొండ చిలువ నుంచి ఎట్టకేలకు విడిపించాడు. ఆ బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ‘‘నా కొడుకుని కొండచిలువ నుంచి కాపాడగానే అతడికి ధైర్యం చెప్పాం. ఆ పాము కరిస్తే చనిపోబోరని, అది విషపూరిత పాము కాదని అన్నాం’’ అని బెన్ చెప్పారు.

తన కుమారుడు కొండ చిలువ బారి నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డాడని అన్నారు. స్విమ్మింగ్ పూల్ లో ముందే పాము ఓ మూలన ఉండి, బాలుడు అందులోకి దిగగానే దాడి చేసి ఉండొచ్చని చెప్పారు. 10-15 క్షణాల్లో తాను పాము నుంచి తన కుమారుడిని విడిపించానని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..