RJ Hattie Pearson : వృద్ధుడి మాటలకు కన్నీరు పెట్టుకున్న రేడియో జాకీ

రేడియో జాకీలు ఎన్నో ఎమోషన్స్ మనసులో పెట్టుకుని షోలు హోస్ట్ చేస్తుంటారు. రీసెంట్‌గా ఓ రేడియో జాకీకి ఓ పెద్దాయనకి జరిగిన సంభాషణలో రేడియో జాకీ భావోద్వేగానికి లోనైంది. పెద్దాయన చెప్పిన విషయం విని కన్నీరు పెట్టుకుంది.

RJ Hattie Pearson : వృద్ధుడి మాటలకు కన్నీరు పెట్టుకున్న రేడియో జాకీ

RJ Hattie Pearson

Updated On : May 27, 2023 / 6:39 PM IST

RJ Hattie Pearson-Hits Radio : రేడియో జాకీలు అంటే గలగల మాట్లాడతారు.. శ్రోతలను నవ్విస్తారు. ఎన్నో అంశాల మీద అవగాహన కల్పిస్తారు. ఓ రేడియో షో హోస్ట్ చేస్తున్న రేడియో జాకీ ఓ పెద్దాయనతో జరిగిన సంభాషణలో ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

A tear-jerking story : మనవడి చికిత్స కోసం మేకప్ బ్యూటీ బ్లాగర్‌గా మారిన పెద్దాయన.. కన్నీరు తెప్పించే కథ

హిట్స్ రేడియో ఆర్జే హాటీ పియర్సన్ ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎప్పుడూ గలగల మాట్లాడే హాటీ పియర్సన్ జాన్ అనే పెద్దాయనతో జరిగిన సంభాషణలో మాత్రం కన్నీరు పెట్టుకుంది. పియర్సన్ జాన్‌ను ‘మీకు డబ్బులు ఉంటే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించింది.. దానికి ఆయన ‘ చనిపోయిన నా భార్య సమాధి కోసం రాయిని కొంటాను’ అని సమాధానం చెప్పాడు. ఆరేళ్ల క్రితం తన భార్య చనిపోయినప్పుడు పెన్షనర్‌గా ఉన్న తను ఆమెకు సమాధి రాయిని కొనడం ఎంత కష్టమైందో వివరించాడు. అది వింటున్న పియర్సన్ ఒక్క క్షణం భావోద్వేగానికి లోనైంది.

 

ఇక పియర్సన్ జాన్ £105,000 (ఇండియన్ కరెన్సీలో 1,07,03,129.20) ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు చెప్పింది. ఆమె చెప్పింది వినగానే జాన్ పియర్సన్‌కి కృతజ్ఞతలు చెప్పాడు. ఇక అతనితో జరిగిన కాన్వర్సేషన్ తనకు ఎలాంటి ఎమోషన్‌ని కలిగించిందో పియర్సన్ చెప్పడంతో వీడియో క్లోజ్ అవుతుంది. Hits Radio ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

Elderly Man Stunts on Bicycle : సైకిల్‌పై పెద్దాయన ఫీట్లు మామూలుగా లేవుగా.. వారెవ్వా ఏం జోరు..!!

‘జాన్ డబ్బు గెలిచినపుడు నేను చంద్రుని మీద ఉన్నాను’ అని ఒకరు.. ‘ వీరి సంభాషణ వింటూంటే ఏడుపు ఆగలేదు’ అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. డైరెక్ట్‌గా షో విన్నవారే కాకుండా.. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు జాన్ మాటలకు చలించిపోయారు.