Canadian PM Justin Trudeau and PM Modi
India-Canada Relation: భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ మీద ఆంక్షలు విధించేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం నిజానికి ఎప్పటిదో.. ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఇప్పుడుదాన్ని కెనడా సర్కార్ మళ్లీ హైలైట్ చేస్తోంది. 2023 జీ20 సమావేశాల తర్వాత నుంచి నిజ్జర్ హత్యపై ట్రూడో ప్రభుత్వం వివాదం మొదలు పెట్టింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం మొదలైంది. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తమవద్ద ఆధారాలు ఉన్నాయని కెనడా పేర్కొంది. దీంతో కెనడా వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై నిర్వహించిన విచారణ కమిషన్ ముందు తాజాగా కెనడా ప్రధాని జస్టిస్ట్ ట్రూడో యూటర్న్ తీసుకున్నాడు. కేవలం నిఘా సమాచారం ఆధారంగా భారత్ పై ఆరోపణలు చేశానని, ఆ సమయంలో ఎటువంటి ఆధారాలు లేవని అంగీకరించారు.
Also Read: భారత్-కెనడా మధ్య వివాదానికి అసలు కారణమేంటి? ట్రూడో ఆరోపణల వెనుక వ్యూహం ఉందా?
గత ఏడాది నిజ్జర్ ను హతమార్చడంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఇన్నాళ్లు ఆరోపించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ప్రస్తుతం యూటర్న్ తీసుకోవటంపై భారత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. చాలా రోజులుగా మేము చెబుతున్న విషయమే ఈరోజు నిర్ధారణ అయిందని అన్నారు. భారత్, దౌత్య వేత్తలపై కెనడా చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని నిరూపితమైంది. భారత్ – కెనడా సంబంధాలు దెబ్బతినడానికి ట్రూడో ప్రవర్తనే కారణమంటూ రణధీర్ జైశ్వాల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తి 1997లో దొంగ పాస్ పోర్టు కింద కెనడా వెళ్లాడు. 2007లో అతడికి కెనడా పౌరసత్వం లభించింది. పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కెనడా కేంద్రంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు కొన్నేళ్లుగా నిరసనలు చేస్తున్నారు. వారిని భారత్ ఉగ్రవాదులుగా ప్రకటించింది. అయితే, ఖలిస్తానీ అగ్రనేత నిజ్జర్ గతేడాది హత్యకు గురయ్యాడు. దీని వెనుక భారత్ ప్రమేయం ఉందని ట్రూడో సర్కార్ ఆరోపిస్తూ వస్తోంది. ఫెడరల్ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ఎలాగైనా ఎన్డీపీ మద్దతు సాధించడం, లేదంటే దాని ఓటర్లను ఆకర్షించడం లక్ష్యంగా జస్టిన్ ట్రూడో భారత్ పై కాలు దువ్వుతున్నారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో దర్యాప్తునకు సహకరించాలని జీ20 ముగింపు సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కోరాడు. భారత భద్రతా సంస్థలు మరింత దర్యాప్తు చేయాలని, మాకు సహకరించాలని ట్రూడో మోదీనికి కోరాడు. అయితే, కెనడాలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతున్నారు.. వారిని అరెస్టు చేయాలని నరేంద్ర మోదీ టూడోకూ సూచించారు. దీంతో.. తమను విమర్శించే ధోరణి భారత్ అవలంభిస్తోందన్న విషయాన్ని జీ20 నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లిన తరువాత అర్ధమైందని టూడో ఇటీవల చెప్పుకొచ్చాడు. మరోవైపు కెనడియన్లకు సంబంధించిన సమాచారాన్ని భారత దౌత్యవేత్తలు సేకరించారని, వాటిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు అందజేశారని మరోసారిసారి ట్రూడో ఆరోపించాడు. ప్రస్తుతం టారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఇటీవల బాబా సిద్ధిఖ్ హత్య కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉండటమే దీనికి కారణం.
Our response to media queries regarding PM of Canada’s deposition at the Commission of Inquiry: https://t.co/JI4qE3YK39 pic.twitter.com/1W8mel5DJe
— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2024