భారత్-కెనడా మధ్య వివాదానికి అసలు కారణమేంటి? ట్రూడో ఆరోపణల వెనుక వ్యూహం ఉందా?
ఈ విబేధాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనే చర్చ మొదలైంది.

India Canada Diplomatic Row (Photo Credit : Google)
India Canada Diplomatic Row : భారత్-కెనడా మధ్య దౌత్త ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ మీద ఆంక్షలు విధించేందుకు కెనడా సిద్ధమవుతోంది. అసలు ఈ స్థాయి వివాదాలు ఎందుకొచ్చాయి? భారత్ కెనడా మధ్య ఏం జరుగుతోంది? ఇండియా మీద ట్రూడో ఘాటు ఆరోపణల వెనుక వ్యక్తిగత స్వార్థం ఉందా? భారీ వ్యూహం ఉందా?
రాజకీయ స్వార్థంతో భారత్ మీద కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు గుప్పిస్తున్నారనే చర్చ జరుగుతున్న వేళ.. ఈ విబేధాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనే చర్చ మొదలైంది. అసలు భారత్ కెనడా మధ్య వివాదం ఎలా మొదలైంది. ప్రస్తుత ఆంక్షలతో ఏం జరగబోతోంది? భారత్ మీద కెనడా ఆంక్షలు విధించే పరిస్థితిలో ఉంది. ఆంక్షలు విధిస్తే భారత్ మీద ఎలాంటి ప్రభావం పడే ఛాన్స్ ఉంది?
నిజ్జర్ హత్య వ్యవహారం నిజానికి ఎప్పటిదో. ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు దాన్ని కెనడా సర్కార్ మళ్లీ హైలైట్ చేస్తోంది. 2023 జీ20 సమావేశాల తర్వాత నుంచి నిజ్జర్ హత్యపై ట్రూడో ప్రభుత్వం వివాదం మొదలు పెట్టింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం మొదలైంది.
ఫెడరల్ ఎన్నికలకు ఏడాది మాత్రమే టైమ్ ఉండటంతో ఎలాగైనా ఎన్డీపీ మద్దతు సాధించడం లేదంటే దాని ఓటర్లను ఆకర్షించడం లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న ట్రూడో.. భారత్ పై ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ ప్లంబర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తి 1997లో దొంగ పాస్ పోర్టు కింద కెనడా వెళ్లాడు. 2007లో అతడికి కెనడా పౌరసత్వం లభించింది. పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కెనడా కేంద్రంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు కొన్నేళ్లుగా నిరసనలు చేస్తున్నారు. వారిని భారత్ ఉగ్రవాదులుగా ప్రకటించింది. అయితే, ఖలిస్తానీ అగ్రనేత నిజ్జర్ గతేడాది హత్యకు గురయ్యాడు. దీని వెనుక భారత్ ప్రమేయం ఉందని ట్రూడో సర్కార్ ఆరోపిస్తూ వస్తోంది.
పూర్తి వివరాలు..
Also Read : ఫస్ట్ టైమ్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఫెయిల్..! అసలు హెజ్బొల్లా ఎలాంటి డ్రోన్లను పంపింది?