Taliban
Zabihullah Mujahid : తమ పాలనను గుర్తించండి…వివిధ దేశాల్లో స్తంభించిపోయిన నిధులను వెంటనే విడుదల చేయాలి..అప్ఘాన్ ఆస్తులపై ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలంటూ…తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ డిమాండ్ చేశారు. ఓ విధంగా హెచ్చరించే ధోరణి ప్రయత్నం చేశారు. లేనిపక్షంలో మునుముందు అంతర్జాతీయ సమస్యగా మారే అవకాశం ఉందంటూ వెల్లడించడం గమనార్హం.
Read More : UP : ప్రేమించిన యువకుడికి భార్యనిచ్చి వివాహం చేశాడు
తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడం అప్ఘాన్ ప్రజల హక్కు అంటూ చెప్పుకొచ్చారు. పాక్, చైనా దేశాలు మాత్రం తాలిబన్లతో సఖ్యతగా ఉంటూ…చర్చలు జరుపుతున్నారు. చైనాలోకి పాక్ మీదుగా..ఎగుమతులకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ హామీనివ్వడం జరిగిందని ముజాహిద్ తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి కాబూల్ లో పర్యటించారు. సరిహద్దు సమస్య పరిష్కారానికై హామీ ఇచ్చినట్లు ముజాహిద్ తెలిపారు.
Read More : Raja Vikramarka: కార్తికేయకి అండగా నాని.. ట్రైలర్ ముహూర్తం ఫిక్స్!
ఇటీవలే అప్గాన్ దేశాన్ని వశం చేసుకున్న తర్వాత..తాలిబన్లు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ..వీరి పాలనను అంతర్జాతీయ దేశాలు కొన్ని అంగీకరించడం లేదు. పాక్, చైనా దేశాలు మాత్రం సఖ్యతగా ఉంటున్నాయి. ఈ క్రమంలో…జబిహుల్లా ప్రకటన జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.