Steve Jobs Old sandals Auction: స్టీవ్‌జాబ్స్ పాత చెప్పులకు వేలం.. రూ.1.78కోట్లు చెల్లించిన వ్యక్తి.. వాటిల్లో స్పెషాల్టీ ఏమిటంటే?

యాపిల్ కోఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ పేరు అందరికీ సుపరిచితమే. ఆయన 2011లో మరణించాడు. జాబ్స్ జీవించి ఉన్నకాలంలో తనకుఇష్టమైన చెప్పులు ఉండేవి. వాటిని జాబ్స్ ఎక్కువగా ధరించేవాడట. తాజాగా వాటిని వేలం వేయగా రూ.1.78 కోట్లు రికార్డు స్థాయిలో ధరకు ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. .

Steve Jobs Old sandals Auction: యాపిల్ కోఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ పేరు అందరికీ సుపరిచితమే. ఫ్యాషన్ విషయానికి‌వస్తే స్టీవ్‌జాబ్స్ బ్లాక్ నెక్ టీషర్ట్, జీన్స్ తో కూడిన యూనిఫారమ్‌కు బాగా ప్రసిద్ధి. అంతేకాదు.. 1970- 1980 మధ్య కాలంలో జాబ్స్ ధరించిన  బిర్కెన్‌స్టాక్ అరిజోనా బ్రౌన్ లెదర్ సాండిల్స్‌ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆపిల్ చరిత్రలో చాలా కీలకమైన క్షణాల్లో స్టీవ్ జాబ్స్ ఈ సాండల్స్‌ను ధరించేవారట.

Apple Co Founder : స్టీవ్ జాబ్స్ దరఖాస్తు వేలం..అమ్ముడుపోయిన ధర ఎంతో తెలుసా ?

1976లో అతను యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి లాస్‌ఆల్టోస్ గ్యారేజీలో అప్పుడప్పుడు ఈ  సాండల్స్ ధరించి యాపిల్ కంప్యూటర్‌ను ప్రారంభించాడట. ఇంతటి ప్రసిద్ధి కలిగిన ఈ  సాండల్స్ ఇటీవల అమెరికాలో జూలియెన్స్ ఆక్షన్ కంపెనీ వేలం నిర్వహించింది. ఈ వేలంలో భాగంగా కళ్లుతిరిగే ధరకు ఈ పాత చెప్పులు అమ్ముడు పోయాయి. ఓ వ్యక్తి 2,20,000 వేల డాలర్లు (సుమారు రూ.1.78 కోట్లు) చెల్లించి ఈ సాండల్స్‌ను సొంతం చేసుకోవటం గమనార్హం.

Eve Jobs: ఐఫోన్-14ను వెక్కిరించిన స్టీవ్ జాబ్స్ కుమార్తె.. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్

జూలియన్స్ ఆక్షన్ సభ్యులు వీటిని 60వేల డాలర్ల ధర వస్తుందని అంచనా వేశారట. సాండల్స్‌కి నాన్ ఫంజిబుల్ టోకెన్ ధర 2,18,750 డాలర్లుగా నిర్ణయించారు. అయితే, రికార్డు స్థాయిలో 2లక్షల20వేల డాలర్లు వచ్చాయి. రికార్డు స్థాయిలో ధరకు ఈ సాండిల్స్‌ను దక్కించుకున్న వ్యక్తి ఎవరనేది ఆక్షన్ కంపెనీ తెలిపేందుకు నిరాకరించింది. స్టీవ్ వోజ్నియాక్ తో కలిసి స్టీవ్ జాబ్స్ 1976లో యాపిల్ కంపెనీని కాలిఫోర్నియాలో ప్రారంభించారు.  2011లో క్యాన్సర్ తో స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు. ఆయన ధరించిన, ఆయనకు ఇష్టమైన చెప్పులను మాత్రం భద్రంగా ఉంచి తాజాగా వేలం వేశారు.

ట్రెండింగ్ వార్తలు