Apple Co Founder : స్టీవ్ జాబ్స్ దరఖాస్తు వేలం..అమ్ముడుపోయిన ధర ఎంతో తెలుసా ?

స్టీవ్ జాబ్స్...ఆయన జీవితంలో పెట్టుకున్న ఒకేఒక్క దరఖాస్తు సమాధానం చెబుతుంది. ఈ దరఖాస్తును వేలం వేయగా..సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Apple Co Founder : స్టీవ్ జాబ్స్ దరఖాస్తు వేలం..అమ్ముడుపోయిన ధర ఎంతో తెలుసా ?

Steve

Steve Jobs Application : స్టీవ్ జాబ్స్…సక్సెస్ కి ఇతను మారుపేరు. యాపిల్ సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఇతను…జాబ్ చేయలేదా ? వేరే కంపెనీల్లో ఉద్యోగం చేయలేదా ? అనే డౌట్ అందరికీ రావొచ్చు. అయితే..ఆయన జీవితంలో పెట్టుకున్న ఒకేఒక్క దరఖాస్తు సమాధానం చెబుతుంది. ఈ దరఖాస్తును వేలం వేయగా..సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చిన్న పేపర్ ముక్క అయినా..ఎంతో మందికి స్పూర్తినిచ్చిందని పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు. 3.43 లక్షల డాలర్లు (సుమారు 2.5 కోట్లు)కు అమ్ముడుపోయింది.

Read More : Husband Gift : తల్లి, కూతురు బుల్లెట్‌పై లాంగ్ డ్రైవింగ్

18 ఏళ్ల వయస్సులో ఆయన ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. యాపిల్ స్థాపనకు మూడేళ్ల ముందు 1973లో ఈ అప్లికేషన్ పెట్టుకున్నారు స్టీవ్ జాబ్స్. ఈ దరఖాస్తులో ఆయన పలు విషయాలను వెల్లడించారు. తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని, ఫోన్ మాత్రం లేదని తెలిపారు. రవాణా సౌకర్యాలు ఒకే కావొచ్చు..కుదరకపోవచ్చన్నారు. ఈ దరాఖాస్తును స్టీవ్ జాబ్స్ స్నేహితులు ఫిజికల్, వెబ్ పేజ్ రూపంలో గత బుధవారం వేలం వేశారు. ఈ జాబ్ అప్లికేషన్ కు వేలం నిర్వహించడం మొదటిసారి కాదు. గతంలో మూడుసార్లు వేలానికి పెట్టారు. 2017లో న్యూయార్క్ లో వేలం వేశారు. ఈ ఏడాది మార్చిలోనూ లండన్ వేలం వేశారు. ఇక్కడ రూ. 1.7 కోట్లు పలికింది. తాజాగా…3.43 లక్షల డాలర్లు పలికింది.