చైనాకు వెళ్లిన విమానాన్ని ఆపేశారు..

చైనాకు వెళ్లిన విమానాన్ని ఆపేశారు..

Updated On : February 21, 2020 / 5:19 AM IST

టన్నుల కొద్దీ మెడికల్ సప్లైను చైనాలోని వుహాన్‌కు తీసుకెళ్లిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్లేన్‌ను భారత్‌కు రాకుండా అడ్డుకున్నారు. విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో విమానం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. న్యూ ఢిల్లీ చెప్పిన దాని ప్రకారం.. చైనాకు మెడికల్ సప్లైను పంపింది. రిటర్న్ జర్నీలో భారతీయులను తీసుకురావాలనేదే  ఆలోచన. 

గురువారం వుహాన్‌లో డెలీవరీ అనంతరం.. తిరిగి వచ్చే క్రమంలో బీజింగ్ నుంచి అనుమతి లభించలేదు. క్లియరెన్స్ లభించగానే విమానం ఇక్కడికి చేరుకుంటుంది. దాని కోసమే వెయిట్ చేస్తున్నాం. ఎందరు భారతీయులు తిరిగొస్తారనే విషయం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కుమార్‌కి కూడా తెలియదని చెప్పారు. 

చైనా నుంచి తిరిగి వచ్చేందుకు 90మంది మాత్రమే రిజిష్టర్ చేసుకున్నారని బీజింగ్ అధికారులు తెలిపారు. భారత విమానంలో వచ్చేందుకు పలు దేశాలకు చెందిన వారున్నరాని కుమార్ అన్నారు. రిజిష్టర్ చేసుకున్న భారతీయులకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత విమానంలో ఇంకెంత మందికి చోటు కల్పిస్తామనేది నిర్ణయిస్తారు. 

భారత్ కు చెందిన వాళ్లు ఎంతమంది ఉన్నారో.. చెప్పలేం. కెపాసిటీకి తగ్గట్లు మాత్రమే తీసుకురాగలం. అటువంటి రిక్వెస్టులు అందుతున్నాయి. అంతా రిజిష్టర్ చేసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోగలమని అధికారులు చెబుతున్నారు.

Read More>>కరోనా పేషెంట్లను చంపేయాలని బస్సుపై దాడి