Apple CEO : చైనాకు దాసోహమన్న యాపిల్ సీఈవో.. సిగ్గు లేదా టిమ్‌ కుక్‌.. ఏది నీ దేశభక్తి?

యాపిల్ సీఈవో టీమ్ కుక్, చైనా కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లు వచ్చిన కథనం అమెరికాలో కలకలం రేపుతోంది.

Apple CEO : ప్రపంచ మార్కెట్లో అమెరికా – చైనా మధ్య జరిగే వాణిజ్య యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవకాశం లేదు. ఒకరు దేశభక్తిని వ్యాపారంలో ఇనుమడించి ముందుకు వెళ్తుండగా.. మరొకరు అణచివేతనే వ్యాపార అస్త్రంగా చేసుకొని ముందుకు వెళ్తున్నాయి. వీరి మధ్య జరిగే వాణిజ్య యుద్ధం కొన్ని దేశాలకు శాపంగా మారితే.. మరికొన్ని దేశాలకు అవకాశం దొరికినట్లవుతుంది.

చదవండి : Apple Salaries: యాపిల్ ఇంజినీర్ల శాలరీలు కోట్లలోనే.. తగ్గేదేలే

అయితే వీరి వాణిజ్య యుద్ధం గురించి కాసేపు పక్కన పెడితే.. యాపిల్ సీఈవో టీమ్ కుక్ వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఇందుకు కారణం ఆయన చైనాతో 275 బిలియన్ డాలర్ల రహస్య ఒప్పందం కుదుర్చుకోవడమే.. తన యాపిల్ సంస్థపై చైనా ఆంక్షలు లేకుండా చూసుకునేందుకు కుక్ రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం భారీ రహస్య ఒప్పందం చేసుకున్నట్లు ‘ది ఇన్ఫర్మేషన్‌’ ఓ కథనం ప్రచురించింది.

2016లో యాపిల్ సీఈవో టీమ్ కుక్ చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలోనే నియంత్రణ చర్యలను తప్పించుకునేందుకు ఐదేళ్ల ఒప్పందం చేసుకున్నట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం యాపిల్ కంపెనీ తయారు చేసే వస్తువుల్లో చాలావరకు చైనా మెటీరియల్ వాడేందుకు కుక్ అనుమతించినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.
చదవండి : Apple : ట్విట్టర్‌లో కొత్త ఫీచర్.. ఆ యూజర్లకు మాత్రమేనట!

చైనాకు చెందిన కాంపోనెంట్స్‌, చైనీస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో ఒప్పందాలు, చైనా యూనివర్సిటీలకు చెందిన సాంకేతికతనే వాడడం, చైనా కంపెనీల్లోనే నేరుగా పెట్టుబడుల.. ఇలాంటి షరతులకు సైతం టిమ్‌ కుక్‌ ఒప్పుకున్నట్లు ఆ కథనం తెలిపింది. రిటైల్‌ స్టోర్స్‌, రీసెర్చ్‌ & డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటు, రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుల కోసమే ఆ ఒప్పందం చేసుకున్నట్లు ది ఇన్ఫర్మేషన్‌ కథనం పేర్కొంది. అయితే 2016లో కుదుర్చుకున్న ఈ ఒప్పందం 2021 తోనే ముగుస్తుంది. కానీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తీసుకొచ్చిన చట్టాలపరిధిలోకి దీనిని తీసుకురావడంతో కాలపరిమితి వచ్చే ఏడాది వరకు పొడిగించినట్లయింది.

చదవండి : Apple Offer: యాపిల్ బంపర్ ఆఫర్.. యూజర్లకు 20శాతం బోనస్

అమెరికాలో టీమ్ కుక్ వ్యవహారశైలి ఎడ్డెమంటే తెడ్డేమ్‌లా తయారైంది. దేశంలో కంపెనీలది ఓ దారి అయితే యాపిల్‌ది రహదారి అన్నట్లు ఉండటం విమర్శలకు తావిస్తుంది. అమెరికా కంపెనీలు దేశభక్తిని హైలెట్ చేస్తూ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటాయి. ఒప్పందాలకు దూరంగా ఉంటూనే చైనా మార్కెట్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇక ట్రంప్ హయాంలో తోక కత్తిరిస్తాడని ముందే గ్రహించిన యాపిల్ కంపెనీ దేశభక్తి ప్రదర్శించింది.

చైనా వాణిజ్య – వ్యాపార నిబంధనలను అంగీకరించలేక అమెరికా కంపెనీలు బిచాణా సర్దేస్తున్న తరుణంలో యాపిల్ ఇందుకు భిన్నంగా రహస్య ఒప్పందం చేసుకుందన్న కథనం కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో యాపిల్ కంపెనీని చైనాకు తాకట్టు పెట్టాడంటూ అమెరికా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి : Apple Watch Series 7 : ఆపిల్‌ వాచ్‌ సేల్స్‌.. భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఫీచర్లు కిరాక్!

 

ట్రెండింగ్ వార్తలు