Rishi Sunak : యూకే ప్రధానమంత్రి రిషి సునక్ పై ఎంపీ అవిశ్వాస లేఖ

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి, భారతీయ సంతతికి చెందిన రిషి సునక్‌పై తాజాగా మొట్టమొదటి సారి ఓ ఎంపీ అవిశ్వాస లేఖ సమర్పించారు. బ్రిటన్ దేశ హోంశాఖ మంత్రి సుయిల్లా బ్రెవర్ మాన్ ను మంత్రి పదవి నుంచి ప్రధాని రిషి సునక్ తొలగించాక, సోమవారం తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించారు....

Rishi Sunak : యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి, భారతీయ సంతతికి చెందిన రిషి సునక్‌పై తాజాగా మొట్టమొదటి సారి ఓ ఎంపీ అవిశ్వాస లేఖ సమర్పించారు. బ్రిటన్ దేశ హోంశాఖ మంత్రి సుయిల్లా బ్రెవర్ మాన్ ను మంత్రి పదవి నుంచి ప్రధాని రిషి సునక్ తొలగించాక, సోమవారం తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించారు. అనంతరం ప్రధాని రిషి సునక్ పై టోరీ ఎంపీ ఆండ్రియా జెంకిన్స్ అవిశ్వాస లేఖను సమర్పించారు.

ALSO READ : Video Viral : ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్…వీడియో వైరల్

కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను తొలగించిన తర్వాత ప్రధాన మంత్రి రిషి సునక్ తన మొదటి అవిశ్వాస లేఖను ఎదుర్కొంటున్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు విధేయురాలైన టోరీ ఎంపీ ఆండ్రియా జెంకిన్స్ ఈ లేఖ రాశారు. సునక్ స్థానంలో నిజమైన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని నియమించాలని ఆమె పిలుపునిచ్చారు.

ALSO READ : Gaza Hospital : గాజా ఆసుపత్రిలో విద్యుత్ కట్…నవజాత శిశువులను ఇంక్యుబేటర్ల నుంచి బయటకు తీసి…

‘‘ఇక చాలు… రిషి సునక్ వెళ్లే సమయం వచ్చింది…’’ అని టోరీ ఎంపీ ఆండ్రియా జెంకిన్స్ ఎక్స్ లో రాసి తన అవిశ్వాస లేఖను పంచుకున్నారు.పాల‌స్తీనాకు అనుకూలంగా తీసిన ర్యాలీ విష‌యంలో పోలీసుల‌పై చేసిన వ్యాఖ్య‌లకు గాను సుయిల్లా బ్రెవర్ మాన్ ను మంత్రి పదవి నుంచి తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు