Video Viral : ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్…వీడియో వైరల్

ప్రపంచ ప్రముఖ క్రికెటర్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ముంబయి వీధిలో రోడ్డు పక్కన ఉన్న బార్బర్ షాపులో కటింగ్, షేవింగ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.....

Video Viral : ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్…వీడియో వైరల్

Cricketer Michael Vaughan

Updated On : November 14, 2023 / 5:56 AM IST

Video Viral : ప్రపంచ ప్రముఖ క్రికెటర్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ముంబయి వీధిలో రోడ్డు పక్కన ఉన్న బార్బర్ షాపులో కటింగ్, షేవింగ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐసీసీ 2023 పురుషుల ఓడీఐ ప్రపంచ కప్‌ను కవర్ చేయడానికి ప్రస్తుతం మైఖేల్ భారతదేశానికి వచ్చారు. రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో క్షవరం చేయించుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో మైఖేల్ పంచుకున్నారు.

ALSO READ : Gaza Hospital : గాజా ఆసుపత్రిలో విద్యుత్ కట్…నవజాత శిశువులను ఇంక్యుబేటర్ల నుంచి బయటకు తీసి…

క్లిప్‌ను షేర్ చేస్తూ, తన స్నేహితుడు దీనాజయల్ తో దీపావళి కటింగ్, హెడ్ మసాజ్ చేయించుకున్నట్లు ఆయన చెప్పారు. మంగలి తన జుట్టును ట్రిమ్ చేస్తున్నప్పుడు క్రికెటర్ కుర్చీలో కుర్చీలో కూర్చొని ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు. కొన్ని సెకన్ల తర్వాత మంగలి మైఖేల్ తల, భుజానికి మసాజ్ చేయడం వీడియోలో కనిపించింది. ముంబయిలోని ఓర్మిస్టన్ రోడ్‌లో నా స్నేహితుడు దీనాజయల్ తో దీపావళి పార్టీ ట్రిమ్,హెడ్ మసాజ్ అంటూ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో మైఖేల్ రాశారు.

ALSO READ : Andhra Pradesh Rains : రెయిన్ అలర్ట్.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

దీనాజయల్ తోనే మైఖేల్ షేవింగ్ కూడా చేయించుకున్నారు. షేవింగ్ చేయించుకుంటున్న చిత్రాన్ని కూడా ఆయన ఎక్స్ లో షేర్ చేశారు. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి పలు స్పందనలు వచ్చాయి. ‘‘ఖరీదైన షోరూమ్‌లో ప్రొఫెషనల్ గా హెయిర్ కట్ చేసుకోవడం ఒక అపోహ… మీరు రోడ్ సైడ్‌ షాపుల్లో కూడా ఉత్తమంగా హెయిర్ కట్ చేయించుకోవచ్చు’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. 161 మంది నెటిజన్లు కామెంట్లు చేశారు.