Andhra Pradesh Rains : రెయిన్ అలర్ట్.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rain Alert For Andhra Pradesh : అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో వానలు దంచికొడతాయన్నారు.

Andhra Pradesh Rains : రెయిన్ అలర్ట్.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rains: Representative Image

Updated On : November 13, 2023 / 11:21 PM IST

విశాఖ వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రేపటికి అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో వానలు దంచికొడతాయన్నారు.

Also Read : వణుకు పుట్టించే వీడియో.. రోడ్డుపై టపాసులు కాల్చుతున్న వారిని కారుతో గుద్దిపడేశాడు

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రేపు(నవంబర్ 14) వర్ష సూచన చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. గుంటూరు, బాపట్ల, నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అటు అల్పపీడనం ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర.. రాయలసీమలో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.