Car Hits : వణుకు పుట్టించే వీడియో.. రోడ్డుపై టపాసులు కాల్చుతున్న వారిని కారుతో గుద్దిపడేశాడు

Noida Hit And Run : ఈ ఘటన తర్వాత కారుని నడుపుతున్న వ్యక్తి మరింత స్పీడ్ తో ముందుకి వెళ్లిపోయాడు. అతడు కారుని ఆపలేదు.

Car Hits : వణుకు పుట్టించే వీడియో.. రోడ్డుపై టపాసులు కాల్చుతున్న వారిని కారుతో గుద్దిపడేశాడు

Noida Hit And Run (Photo : Google)

రోడ్డుపై టపాసులు కాలుస్తున్నారా? అయితే బీకేర్ ఫుల్. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. రోడ్డుపై ఏవైనా వాహనాలు వస్తున్నాయేమో ఓసారి చెక్ చేసుకోండి. లేదంటే ఘోరం జరిగిపోవడం ఖాయం. ఎందుకంటే.. రోడ్డుపై బాణసంచా కాలుస్తున్న ముగ్గురిని ఓ వ్యక్తి కారుతో గుద్దిపడేశాడు. వేగంగా దూసుకొచ్చిన కారు వారి మీదుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. నోయిడాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.

ఆదివారం రాత్రి సెక్టార్ 119లోని ఎల్ డెకో అమంత్రన్ సొసైటీ గేట్ నెంబర్ 2 ముందు రోడ్డుపై ఓ కుటుంబం పటాకులు కాలుస్తోంది. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. రోడ్డుపై అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని గుద్దిపడేసింది. రోడ్డుపై ఉన్న వారి మీదుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వృద్ధుడు విజయ్ పాల్ సింగ్(72), ఆయన అల్లుడు(42), మనవరాలు(8) గాయపడ్డారు. ఈ ముగ్గురిలో వృద్ధుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. కారు వృద్ధుడిని కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఆయనకు పలు చోట్ల గాయాలు అయ్యాయి.

ఈ ఘటన తర్వాత కారుని నడుపుతున్న వ్యక్తి మరింత స్పీడ్ తో ముందుకి వెళ్లిపోయాడు. అతడు కారుని ఆపలేదు. అయితే, ఇదంతా ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ లో రికార్డ్ అయ్యింది. టపాసులు కాల్చుతుండగా ఓ వ్యక్తి తన ఇంట్లో నుంచి మొబైల్ లో రికార్డ్ చేస్తుండగా.. ఈ దారుణం కూడా అందులో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : షాకింగ్.. దీపావళికి బోనస్, సెలవు ఇవ్వలేదని ఓనర్‌ని హత్య చేసిన సిబ్బంది

”మా కుటుంబసభ్యులు అంతా కలిసి క్రాకర్స్ కాలుస్తున్నాం. అంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇంతలో పెద్ద శబ్దం వినిపించింది. టపాసు పేలిన సౌండ్ అని అనుకున్నాం. కానీ, సౌరభ్ నేలపై పడి ఉండటం చూసి షాక్ అయ్యా. కారు గుద్దిందని తెలిసింది. నేను వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లా. సౌరభ్ కు సాయం చేద్దామని అనుకున్నా. అప్పుడే నాకు మరో షాకింగ్ విషయం తెలిసింది. నా కూతురిని కూడా కారు గుద్దేసింది. కారు కుడివైపునకు తిరిగి ఉంటే బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది. ఈ ప్రమాదం తర్వాత కారు ఆగలేదు. ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ క్లియర్ గా లేదు” అని బాధితుల బంధువు ఒకరు తెలిపారు.

ఈ ఘటనతో కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ముగ్గురు రోడ్డుపై పడి ఉన్నారు. కుటుంబసభ్యులు షాక్ తో కేకలు వేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తిని గుర్తించి పట్టుకునే పనిలో పడ్డారు.

Also Read : బరితెగించిన స్కూల్ టీచర్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్

ఈ యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకంగా చేసిందా? లేక అనుకోకుండా జరిగిపోయిందా? అనేది తేలాల్సి ఉంది. కాగా, ఈ ఘటన ఓ హెచ్చరిక లాంటిది. రోడ్డుపై క్రాకర్స్ కాల్చే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్డుపై ఏవైనా వాహనాలు వస్తున్నాయో లేదో చూసుకోవాలి. అంతా సేఫ్ అనుకున్న తర్వాతే క్రాకర్స్ కాల్చుకోవాలి. లేదంటే, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.