Roger Federer: రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్.. 24 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై!

టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, ప్రపంచ ఆల్‌టైమ్ టెన్నిస్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరైన రోజర్ ఫెదరర్ టెన్నిస్‌కు వీడ్కోలు ప్రకటించాడు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు.

Roger Federer: టెన్నిస్ దిగ్గజాల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న స్విస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ టెన్నిస్‌కు వీడ్కోలు ప్రకటించాడు. ఈ మేరకు శనివారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.

Serial Killer: జైల్లో సీరియల్ కిల్లర్.. భయపడుతున్న తోటి ఖైదీలు

ఈ నెల 23 నుంచి లండన్‌లో జరగనున్న లావెర్ కప్ ఏటీపీనే తన చివరి టోర్నమెంట్ అని వెల్లడించాడు. 1998లో టెన్నిస్ క్రీడలోకి అడుగుపెట్టిన రోజర్ ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఎనిమిది వింబుల్డన్ ట్రోఫీలు, ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్, ఒక ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో రజత పతకం అందుకున్నాడు.

Hyderabad: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి, మత్తు మందు ఇచ్చి ఘాతుకం

కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న 41 ఏళ్ల ఈ ఆటగాడు గత యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో కూడా పాల్గొనలేకపోయాడు. కాగా, తన 24 ఏళ్ల కెరీర్.. 24 గంటల్లా గడిచిపోయాయని ఫెదరర్ అన్నాడు. ఇక కెరీర్లో దాదాపు 1,500కు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఫెదరర్ ర్యాంకింగ్స్‌లో కూడా సత్తా చాటాడు. 310 వారాలపాటు నెంబర్ 1 ర్యాంకులో కొనసాగడం విశేషం.

 

ట్రెండింగ్ వార్తలు