Expensive Porcelain Bowl : చిన్న పింగాణి గిన్నె ధర అక్షరాలా రూ. కోటి, దాని ప్రత్యేక ఏంటో తెలుసా..?

అదొక చిన్న పింగాణీ గిన్నె. కానీ దాని విలువ మాత్రం ఎవ్వరు ఊహించలేదు. ఓ చిన్న పింగాణీ గిన్నెను అంత భారీ ధర రావటంతో నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోయారు.

Royal Chinese porcelain bowl

Expensive Chinese Porcelain Bowl : ఓ టీ పాట్ ధర అక్షరాల రూ.24 కోట్లు అని విని ఆశ్చర్యపోయాం. రూ.24 కోట్లకు అమ్ముడైన టీ పాట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన టీపాట్ గా క్రెడిట్ కొట్టేసింది. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ టీ పాట్ కు 18క్యారెట్ల బంగారం, 1658 వజ్రాలు,6.67 క్యారెట్ల రూబీలను కూడా అమర్చటం, దానికి ఓ చరిత్ర ఉండటంతో అంత ధరకు అమ్ముడుకావటానికి కారణమైంది. కానీ ఓ చిన్న పింగాణీ గిన్నె ఏకంగా రూ.కోటికి  పైగా అమ్ముడై నోరెళ్లబెట్టేలా చేసింది. ఓ చిన్న పింగాణీ గిన్నె ఏకంగా రూ.1.09 కోట్లు ధర పలకటంతో నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు.

చైనా పింగాణీకి ఫుల్ డిమాండ్ ఉందనే విషయం తెలిసిందే. కానీ మరీ ఇంత డిమాండ్ ఉందని తెలిసి నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. ఇంగ్లండ్ (England)లోని డోర్చెస్టర్ (Dorchester)కు చెందిన డ్యూక్స్ ఆక్షనీర్స్ (Duke Auctioneers)సంస్థ తరచూ పురాతన వస్తువులను వేలం వేస్తుంటుంది. దీంట్లో భాగంగానే ఇటీవల ఓ పురాతన పిగాణి పాత్రను వేలం వేసింది. దీనికి వారు ఊహించినదాని కంటే ఎక్కువ ధర రావటంతో సదరు సంస్థ యాజమాన్యం కూడా ఆశ్చర్యపోయింది. వేలానికి పెట్టిన ఈ పింగాణీ గిన్నె రూ.1.09 కోట్లు పలికింది. కేలం రూ.10వేలు వస్తుందనుకుంటే ఏకంగా కోటి రూపాయలకు పైగా రావటంతో వారి పంట పండింది.

Damaged Wall For Sale : కూలిపోయేలా ఉన్న ఈ గోడ ధర అక్షరాలు రూ.41 లక్షలు ..

చైనాకు చెందిన ఈ పురాతన పింగాణి పాత్రకు మహా అయితే రూ.10వేల ధర పలుకుతుందని నిర్వాహకులు భావించారు. దీంతో వేలం ధరను రూ.3,169 నుంచి ప్రారంభించారు. చాలామంది శ్రీమంతులు బిడ్స్ వేశారు. కానీ వారు ఊహించనిదానికంటే వేలం ధర పెరుగుతు వెళ్లటంతో వారు ఆశ్చర్యపోయారు. కొంతమంది నిపుణులైన బిడ్డర్లు.. ఇది చైనాకు చెందిన మింగ్ వంశీకుల నాటి వస్తువని గుర్తించారు. దాంతో వేలంపాట ఒక్కసారిగా మారిపోయింది. అక్కడికి వచ్చినవాళ్లంతా అనూహ్యంగా ధర పెంచుకుంటూ పోయారు. దాన్ని దక్కించుకోవటానికి పాటను పెంచుకుంటు పోయారు.

అలా పాట పెరిగి పెరిగి చివరకు ఇంగ్లండ్ కు చెందిన పురావస్తులు సేకరించే ఓ వ్యక్తి 1.04 లక్షల పౌండ్లు (రూ.1.09 కోట్లు)కు సొంతం చేసుకున్నాడు. కాగా..మింగ్ రాజవంశీకులు (Ming dynasty) చైనాను 1368 నుంచి 1644 కాలంలో పాలించారు. వాళ్ల హయాంలో తయారైన వస్తువులు అత్యంత నాణ్యమైనవి, కళాత్మకమైనవి అని ప్రసిద్ధి చెందాయి. వారి వంశానికి చెందిన వస్తువులు ఎక్కడ వేలం వేసినా అధిక ధరకు అమ్ముడవుతుంటాయి. అలాగే ఈ చిన్న పింగాణీ గిన్నె కూడా ఊహించని ధర పలికి శ్రీమంతులతో పాటు నిర్వాహకుల్ని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది.


ట్రెండింగ్ వార్తలు