Damaged Wall For Sale : కూలిపోయేలా ఉన్న ఈ గోడ ధర అక్షరాలు రూ.41 లక్షలు ..

ఎవరైనా ఇల్లు అమ్మకానికి పెడతారు. స్థలం అమ్మకానికి పెడతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కేవలం ఒకే ఒక్క గోడను అమ్మకానికి పెట్టాడు. ఓ గోడను అమ్మటమే ఓ విడ్డూరం అనుకుంటే దాని కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చాడు.

Damaged Wall For Sale : కూలిపోయేలా ఉన్న ఈ గోడ ధర అక్షరాలు రూ.41 లక్షలు ..

Damaged Wall For Sale (

Damaged Wall For Sale : లక్షలు లక్షల రూపాయలు పోసి ఇళ్లు కొంటాం. స్థలాలు కొంటాం. కార్యాలయాలు కొంటాం. బంగారం కొంటాం. వజ్రాలు కొంటాం. ఆఖరికి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఇల్లు కూడా కొంటాం. శిథిలావస్థలో ఉండే ఇల్లు కొంటే దాన్ని కూల్చేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. ఆ ఉద్ధేశ్యంతోనే కొంటాం. అలాగే మనకేమన్నా ఆర్థిక అవసరాలు ఉంటే ఉన్న ఇంటినో లేదా స్థలాన్నో అమ్మాకానికి పెడతాం.  కానీ ఓ వ్యక్తి మాత్రం కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఓ ‘గోడ’ను అమ్మకానికి పెట్టాడు. దాని కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చాడు. గోడ అంటే ఆ గోడకు సంబంధించి ఓ స్థలం ఉందా అనుకుంటే అది కూడా లేదు. అది కేవలం ఓ గోడ మాత్రమే. సింగిల్ గా ఉండే ఆ గోడను అమ్మకానికి పెట్టటంతో అదికాస్తా వైరల్ గా మారింది.ఈ వింత ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమ్మకానికి పెట్టిన ఈ గోడ ఉన్న ప్రాంతంలో ఓ పెద్ద ఇల్లు కొనాలనుకుంటే ఓ రూ.10కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఓ పాత గోడ మాత్రం రూ.41లకు అమ్మకానికి పెట్టటం  వైరల్ గా మారింది.

Imran Khan : జైలులో ఇమ్రాన్‌ఖాన్‌కు నెయ్యితో దేశీ చికెన్, మటన్ భోజనం

అది అమెరికా(America)లోని వాషింగ్టన్ ( Washington)డీసీ రాష్ట్రంలోని ఓల్డ్ జార్జిటౌన్‌(Old Georgetown). అక్కడే ఉందీ గోడ కథా కమామీషు. గోడ అంటే ఇల్లు కూడా ఉంటుంది కదా..ఇల్లు అంటే దానికి ఇరుగు పొరుగు ఇళ్లు కూడా ఉంటాయి కదా..అలా గోడకు సంబంధించిన కొంత భాగం ఓ మహిళ పేరు మీద మరో కొంత భాగం మరో వ్యక్తి పేరు మీద ఉంది. అక్కడే మొదలైంది గోడ రాద్ధాంతం. ఆ మహిళ పేరు డేనియలా(Daniela), మరో వ్యక్తి పేరు అలెన్ బర్గ్ (Allen). ఆ పురాతనమైన గోడకు సంబంధించి వీరిద్దరి మధ్యా గొడవ ఎంతో కాలంగా జరుగుతోంది.  వీరి గొడవను టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.వారు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. గోడనుంచి వాటర్ లీక్ అవుతోందని తేల్చారు. దీంతో వాటర్ లీకేజ్ వల్ల తన ఇల్లు దెబ్బతింటోందని ఇదంతా అలెన్ నిర్లక్ష్యం వల్లేనని దీనికి బాధ్యత అతనే వహించాలని డిమాండ్ చేస్తోంది. దానికి అలెన్ తాను గోడ నుంచి వాటర్ లీక్ కాకుండా చాలా డబ్బుల ఖర్చు చేశానని ఇక ఆ గోడమీద డబ్బులు ఖర్చు చేయటం నా వల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు.

United States : యాంకర్‌కి లైవ్‌లో ప్రపోజ్ చేసిన రిపోర్టర్.. ఎక్కడంటే?

దీంతొ గోడతో అంత ఇబ్బందిగా ఉంటే మీరే కొనుక్కోండి అన్నాడు  అలెన్. ధర ఎంతో చెప్పమంది డేలియలా. దాని ధరను 50 వేల డాలర్లు చెప్పాడు.అంటే భారత కరెన్సీలో  రూ. 41 లక్షలకుపైనే.కూలిపోయే గోడకు అంత ఇవ్వనని 600 డాలర్లు (ఇండియా కరెన్సీలో దాదాపు రూ. 50వేలు) మాత్రమే ఇస్తానని డేనియెలా తేల్చి చెప్పింది. పాతగోడకు అంత ఖరీదు ఎవరూ ఇవ్వరని అలెన్‌కు అందరు నచ్చజెబుతున్నా అతడు మాత్రం పట్టువదల్లేదు. ఇల్లు పాడైపోతోంది కాబట్టి చచ్చినట్టుగా తాను చెప్పిన ధరకే డేనియెల్ కొని తీరుతుందని పట్టుపట్టుక్కూర్చున్నాడు అలెన్. డేనియల్ కూడా అంత ధర పెట్టలేనంటోంది. దీంతో అలెన్ తన పాత గోడను అమ్ముతున్నట్లుగా ఏకంగా ప్రకటన ఇచ్చాడు. దీంతో ఈ వార్త కాస్తా వైరల్ అవుతోంది. ఫొటోను చూసిన జనం అంత మంచి ఇల్లు రూ. 41 లక్షలకే వస్తుందని ముందు అపోహపడి ఆ తరువాత అసలు విషయం తెలిసి ఇదేంది రా బాబు ఇల్లు లేదు..స్థలమూ లేని ఆ గోడను అమ్మకానికి పెట్టటమేంటీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.