×
Ad

sneaker company : ఆ షూల వల్ల ఇబ్బందికరమైన కీచు శబ్దం వస్తుంది.. ప్రముఖ షూ కంపెనీపై యూఎస్ కోర్టులో దావా..

sneaker company : స్విట్జర్లాండ్‌‌కు చెందిన అథ్లెటిక్ షూ కంపెనీ ‘ఆన్’ పై అమెరికాలోని డిస్ట్రిక్ట్ కోర్టులో కస్టమర్లు దావా వేశారు. క్లౌడ్ టెక్నాలజీతో తయారైన

sneaker company : స్విట్జర్లాండ్‌‌కు చెందిన అథ్లెటిక్ షూ కంపెనీ ‘ఆన్’ పై అమెరికాలోని డిస్ట్రిక్ట్ కోర్టులో కస్టమర్లు దావా వేశారు. క్లౌడ్ టెక్నాలజీతో తయారైన ఈ రన్నింగ్ షూస్ వల్ల తాము నడుస్తున్నప్పుడు వింతగా, ఇబ్బందికరంగా.. కీచు శబ్దం వస్తుందని పేర్కొన్నారు.

‘అన్’ అనేది స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన ఒక అథ్లెటిక్ షూ కంపెనీ. ఇది రన్నింగ్ షూస్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ 100కంటే ఎక్కువ దేశాల్లో దాని ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఈ కంపెనీ షూస్‌కు అమెరికాలో పెద్ద మార్కెట్ ఉంది. ఈ కంపెనీ క్లౌడ్ టెక్నాలజీతో షూస్ తయారు చేస్తుంది. ఈ స్పీకర్స్ సాధారణ ధర 200డాలర్లు ఉంటుంది. వీటిని క్లౌడ్ టెక్నాలజీతో తయారు చేయడం వల్ల వినియోగదారులు పరుగెత్తే సమయంలో గాలిలో తేలియాడుతున్నట్లు రూపొందించారు. అయితే, ఈ షూస్ కొనుగోలు చేసిన వ్యక్తులు.. ఈ షూస్‌తో నడుస్తున్నా, పరుగెత్తుతున్నా విచిత్రమై.. వింతైన కీచు శబ్ధం వస్తుందని పేర్కొంటూ కోర్టులో దావా వేశారు.

అక్టోబర్ 9వ తేదీన పోర్ల్‌ల్యాండ్‌లోని ఒరెగాన్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో కొందరు వ్యక్తులు క్లాస్ యాక్షన్ దావా వేశారు. ఆన్ కంపెనీకి చెందిన 11 రకాల షూలపై దావాలో ప్రస్తావించారు. ఇందులో క్లౌడ్ 5, క్లౌడ్ 6, క్లౌడ్‌మాన్‌స్టర్, క్లౌడ్‌రన్నర్ కు సంబంధించిన షూలు కూడా ఉన్నాయి.

వాస్తవానికి క్లౌడ్‌టెక్ షూలు కాళ్లకు ధరించినప్పుడు మొత్తని మద్దతును అందించడానికి రూపొందించారు. కానీ, కోర్టులో దావా వేసిన వారి వాదన ప్రకారం.. క్లౌడ్‌టెక్ సాంకేతికతతో తయారు చేయబడిన బూట్లను ధరించినప్పుడు, పరుగెత్తిన సమయంలో కాలు ఒత్తిడికి గురవుతుంది.. అంతేకాదు.. ప్రతి అడుగులో బూట్ల నుంచి పెద్దగా కీచు శబ్దం వస్తుందని, అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

క్లౌడ్ టెక్ సాంకేతికతతో ఆన్ కంపెనీ తయారు చేసిన షూలను కొనుగోలు చేసిన వేల మందికి పరిహారం, చట్టబద్ధమైన, శిక్షాత్మక కలిగిన నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోర్టును కోరారు.

Also Read: Free gold : ఆహా.. బంపర్ ఆఫర్.. బంగారం ఫ్రీగా ఇచ్చేస్తున్నారు.. గోల్డ్ వ్యాపారుల కొత్త ప్లాన్..